MLA Padi Kaushik Reddy | ఆరు వారాలు గడువు ఇవ్వండి.. ఎథిక్స్ కమిటీకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభ్యర్థన
MLA Padi Kaushik Reddy | ఈ ఏడాది మార్చి 29న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
MLA Padi Kaushik Reddy | త్రినేత్ర.న్యూస్ : ఈ ఏడాది మార్చి 29న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎథిక్స్ కమిటీ సెప్టెంబర్ 5 లోపు వివరణ ఇవ్వాలని కోరుతూ కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై కౌశిక్ రెడ్డి స్పందిస్తూ.. వివరణ ఇచ్చేందుకు తనకు ఆరు వారాల గడువు కావాలని కోరారు. ఈ మేరకు ఎథిక్స్ కమిటీకి ఆయన లేఖ రాశారు.
తన ఎథిక్స్ కమిటీ నోటీసు ఆగస్టు 31న అందిందని లేఖలో వెల్లడించారు. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున సమయం అవసరమని తెలిపారు. ఎథిక్స్ కమిటీ ఇచ్చిన మెటీరియల్ వాల్యూమ్ ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే సమగ్ర వివరణ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.
మార్చి 29 ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ పూర్తిగా లేదని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆ రోజు అసెంబ్లీ మొత్తం ప్రోసిడింగ్స్‌కు సంబంధించిన పూర్తి వీడియో ఇవ్వాలని కోరారు. పూర్తి వీడియోను పరిశీలించి వివరంగా సమాధానం ఇస్తానని ఆయన పేర్కొన్నారు. ఆరు వారాలు లేదా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వరకు గడువు ఇవ్వాలని ఎథిక్స్ కమిటీకి కౌశిక్ రెడ్డి అభ్యర్థించారు.
తాజావార్తలు
- ●Data Center | హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్
- ●Kishan Reddy | రాష్ట్రాన్ని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చారు
- ●TPCC Gouri Satish | 22A పై బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్.. రాష్ట్రాన్ని లూటీ చేసిన కేటీఆర్కు ఆ అర్హత లేదు
- ●iPhone | సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా..? ఈ 5 విషయాలను తప్పక చెక్ చేయండి..
- ●Anupama Paramewaran | నిజమైన ప్రేమలో ఆప్షన్లు ఉండవు - మాజీ ప్రియుడిపై అనుపమ సెటైర్స్
- ●MP Etala Rajendar | మిస్టర్ రేవంత్, పొంగులేటి! 22ఏ లో పెట్టే అధికారం మీకెవడిచ్చాడు?

Data Center | హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్

Kishan Reddy | రాష్ట్రాన్ని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చారు

TPCC Gouri Satish | 22A పై బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్.. రాష్ట్రాన్ని లూటీ చేసిన కేటీఆర్కు ఆ అర్హత లేదు

iPhone | సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా..? ఈ 5 విషయాలను తప్పక చెక్ చేయండి..




