Old Monk Ban | హైకోర్టులో ఓల్డ్ మంక్‌కు చుక్కెదురు: అసలు అది ‘రమ్’ కానే కాదన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ.. నెక్స్ట్ ఏంటి?
మహారాష్ట్రలో ఓల్డ్ మంక్ బ్రాండ్‌కు హైకోర్టులోనూ చుక్కెదురైంది. అసలు అది రమ్ కాదని, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వాడుతున్నారని FSSAI బాంబు పేల్చింది.
- మహారాష్ట్రలో ఓల్డ్ మంక్ అమ్మకాలపై FSSAI విధించిన ఆంక్షలను ఎత్తివేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరణ
- న్యూట్రల్ స్పిరిట్స్‌కు కృత్రిమ రమ్ ఫ్లేవర్లను కలపడం వల్ల దీన్ని అసలైన 'రమ్' అని పిలవడానికి వీల్లేదని కోర్టుకు వెల్లడి
- బాటిల్‌పై ఉన్న "7 ఏళ్ల ఏజింగ్" (Ageing) క్లెయిమ్స్ కస్టమర్లను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యలు
- లేబుల్ మార్చేందుకు ఓల్డ్ మంక్ అంగీకారం
- తదుపరి విచారణ సెప్టెంబర్ 11కు వాయిదా
Old Monk Ban Maharashtra | త్రినేత్ర.న్యూస్ : ప్రముఖ లిక్కర్ బ్రాండ్ ఓల్డ్ మంక్ (Old Monk) ప్రియులకు ఇది నిరాశ కలిగించే వార్త. మహారాష్ట్రలో ఈ బ్రాండ్ అమ్మకాలపై ఉన్న నిషేధం ఇప్పట్లో తొలగిపోయేలా లేదు. ఓల్డ్ మంక్ సేల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విధించిన బ్యాన్‌ను ఎత్తివేసేందుకు బాంబే హైకోర్టు (Bombay High Court) తాజాగా నిరాకరించింది.
అసలు వివాదం బాటిల్ లేబులింగ్ (Labelling), 7 ఏళ్ల ఏజింగ్ క్లెయిమ్స్, అందులో వాడుతున్న ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ చుట్టే తిరుగుతోంది. ఓల్డ్ మంక్ తయారు చేసేది అసలు 'రమ్' (Rum) కానే కాదని FSSAI కోర్టుకు తేల్చి చెప్పింది.
న్యూట్రల్ స్పిరిట్స్‌కు కృత్రిమ రమ్ ఫ్లేవర్లను (Artificial flavouring) యాడ్ చేసి ఓల్డ్ మంక్ తయారు చేస్తున్నారని FSSAI విచారణలో తెలిపింది. కేవలం రమ్ లాంటి ఫ్లేవర్ ఉన్నంత మాత్రాన న్యూట్రల్ స్పిరిట్‌ను రమ్ అని మార్కెట్ చేయడానికి వీల్లేదని కరాఖండీగా చెప్పేసింది. ఈ కారణంతోనే మహారాష్ట్రలో (Maharashtra) ఆ బ్రాండ్ సేల్స్ పై నిషేధం విధించినట్లు కోర్టుకు వివరించింది.
ఈ కేసు విచారణలో కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. స్పిరిట్ మొత్తాన్ని 7 ఏళ్ల పాటు నిల్వ ఉంచినట్లు (Aged for seven years) బాటిల్ పై ఉన్న లేబుల్స్.. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. అయితే, తమ బాటిల్ లేబుల్స్ పై 'యాడెడ్ ఫ్లేవర్' (Added flavor) అని స్పష్టంగా కనిపించేలా మార్పులు చేసేందుకు ఓల్డ్ మంక్ యాజమాన్యం అంగీకరించింది.
అయినప్పటికీ కోర్టు నుంచి ఓల్డ్ మంక్‌కు తక్షణ ఉపశమనం లభించలేదు. దీంతో మహారాష్ట్రలో ఓల్డ్ మంక్ సేల్స్‌పై ఉన్న బ్యాన్ ప్రస్తుతానికి కొనసాగనుంది. ఈ నిషేధపు ఆర్డర్‌ను కొట్టివేయాలని ఓల్డ్ మంక్ చేసుకున్న అభ్యర్థనపై బాంబే హైకోర్టు సెప్టెంబర్ 11న తదుపరి విచారణ జరపనుంది.
తాజావార్తలు
- ●Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. రాజస్థాన్ మట్టితో నాలుగు రాష్ట్రాల కళాకారులు తయారీ
- ●Hero Karthi | ధురంధర్ స్ఫూర్తితో సర్దార్ 2 తెరకెక్కిందా? కంపేరిజన్స్పై హీరో కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ●Coal Gasification Scheme | బొగ్గు గ్యాసిఫికేషన్ పథకానికి స్పందన కరువంటూ వార్తలు.. స్పష్టతనిచ్చిన కేంద్రం..!
- ●Telangana Employees | చలో హైదరాబాద్.. రేపే ఉద్యోగుల సంకల్ప సభ
- ●CEO Sudarshan Reddy | సర్ గడువు పొడిగించండి.. ఈసీఐకి సీఈవో లేఖ
- ●Sumitra Anand | ఎన్ని కథలు చెప్పినా రేవంత్ రెడ్డికి సున్నా మార్కులే

Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. రాజస్థాన్ మట్టితో నాలుగు రాష్ట్రాల కళాకారులు తయారీ

Hero Karthi | ధురంధర్ స్ఫూర్తితో సర్దార్ 2 తెరకెక్కిందా? కంపేరిజన్స్పై హీరో కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Coal Gasification Scheme | బొగ్గు గ్యాసిఫికేషన్ పథకానికి స్పందన కరువంటూ వార్తలు.. స్పష్టతనిచ్చిన కేంద్రం..!

Telangana Employees | చలో హైదరాబాద్.. రేపే ఉద్యోగుల సంకల్ప సభ



