త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Zoo | చంపేస్తున్న ‘చ‌లి’.. హైద‌రాబాద్ జూలో వెచ్చ‌ని ఎన్‌క్లోజ‌ర్లు..!

Hyderabad Zoo | చ‌లి గాలుల తీవ్ర‌త రోజురోజుకు పెరిగిపోతోంది. సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్ర‌త‌లు ప‌రిమిత‌మ‌వుతున్నాయి. ఈ చ‌లి గాలుల‌కు మ‌న‌షులే త‌ట్టుకోలేక‌పోతున్నారు. మ‌రి జంతువుల ప‌రిస్థితి ఏంటి..? అందుకే హైద‌రాబాద్‌లోని నెహ్రూ జూపార్కు జంతువుల కోసం ప్ర‌త్యేక ఎన్‌క్లోజ‌ర్ల‌ను ఏర్పాటు చేసింది.

S

Hyderabad | Published On Dec 9, 2025, 3.40 pm IST

Hyderabad Zoo | చంపేస్తున్న ‘చ‌లి’.. హైద‌రాబాద్ జూలో వెచ్చ‌ని ఎన్‌క్లోజ‌ర్లు..!
Advertisement

Hyderabad Zoo | హైద‌రాబాద్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం వ్యాప్తంగా చ‌లి చంపేస్తోంది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్ర‌త‌లు ప‌రిమితం కావ‌డంతో.. వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది చ‌లి. రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలో మంగ‌ళ‌వారం 8.5 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో నెహ్రూ జూలాజిక‌ల్ పార్కు అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. రాత్రి వేళ ఉష్ణోగ్ర‌త‌లు అత్య‌ల్పంగా న‌మోదు అవుతుండ‌డంతో.. జంతువుల‌కు వెచ్చ‌ని వాతావ‌ర‌ణం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ క్ర‌మంలో జూపార్కు వ్యాప్తంగా 100 వ‌ర‌కు రూమ్ హీట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. మ‌రి ముఖ్యంగా సింహాలు, పులులు, కోతులు, ఎలుగుబంట్లు ఉంటున్న ఎన్‌క్లోజ‌ర్ల‌లో రూమ్ హీట‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చ‌ల్లని గాలులు వీస్తుండ‌డంతో.. న్యూమోనియా బారిన జంతువులు ప‌డొద్ద‌నే ఉద్దేశంతో ఎన్‌క్లోజ‌ర్ల చుట్టూ గోనె సంచుల‌ను ఏర్పాటు చేసి, వెచ్చ‌దనాన్ని క‌ల్పిస్తున్నారు జూ అధికారులు.

ప‌క్షులు, స‌రీసృపాలు ఉండే ప్రాంతాల్లో ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇవి నివ‌సించే ప్ర‌దేశాల్లో 100 వాట్‌ల సామర్థ్యం ఉన్న విద్యుత్ బ‌ల్బుల‌ను ఏర్పాటు చేసి వెచ్చ‌దనాన్ని క‌ల్పిస్తున్నారు. ఇక చుట్టుతా ఆకులను క‌ప్పి ఉంచి, బంక‌మ‌ట్టితో వాటిని క‌వ‌ర్ చేసి చ‌లి గాలుల తీవ్ర‌త నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నారు.

ఈ సీజ‌న్‌లో జంతువుల శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. జలుబు క‌లిగించే ఆహార ప‌దార్థాల‌ను జంతువుల‌కు ఇవ్వ‌డం లేద‌న్నారు. సిట్ర‌స్ అధికంగా ఉండే ఆరెంజ్‌, నిమ్మ‌కాయ‌ల‌ను ఆహారంగా ఇవ్వ‌డం లేద‌ని తెలిపారు. ఈ రెండింటి వ‌ల్ల జంతువులు జ‌లుబు బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. సిట్ర‌స్ స్థానంలో బొప్పాయి పండ్ల‌ను ఆహారంగా ఇస్తున్నామ‌న్నారు. చ‌లికాలంలో బొప్పాయి పండ్లు జంతువుల శ‌రీరంలో వేడిని పుట్టిస్తాయ‌ని చెప్పారు. కొబ్బ‌రి, గ్లూకోస్ వాట‌ర్‌ణు అందిస్తున్న‌ట్లు తెలిపారు. చ‌లికాలం ముగిసే వ‌ర‌కు ఆహార ప‌దార్థాల విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తామ‌ని అధికారి పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement