త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | బోడుప్ప‌ల్‌లో పిల్ల‌ర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మ‌ర‌ణం

Road Accident | హైద‌రాబాద్‌లోని బోడుప్ప‌ల్‌లో (Boduppal) ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఓ కారు అదుపుత‌ప్పి పిల్ల‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.

G

Hyderabad | Published On Jan 28, 2026, 6.52 am IST

Road Accident | బోడుప్ప‌ల్‌లో పిల్ల‌ర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మ‌ర‌ణం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని బోడుప్ప‌ల్‌లో (Boduppal) ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఓ కారు అదుపుత‌ప్పి పిల్ల‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌పడ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. మృతులు, గాయ‌ప‌డిన‌వారిని వ‌న‌ప‌ర్తికి చెందిన బీటెక్ విద్యార్థులుగా (B.Tech Students) గుర్తించారు. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో ఎనిమిది మంది ఉన్న‌ట్లు తెలిపారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement