త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rains | హైద‌రాబాద్‌లో చిరుజ‌ల్లులు..

Rains | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో సోమ‌వారం సాయంత్రం ఆకాశం మేఘావృత‌మైంది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు కురిశాయి.

S

Hyderabad | Published On Feb 23, 2026, 5.31 pm IST

Rains | హైద‌రాబాద్‌లో చిరుజ‌ల్లులు..
Advertisement

Rains | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో సోమ‌వారం సాయంత్రం ఆకాశం మేఘావృత‌మైంది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు కురిశాయి. ఉద‌యం నుంచి ఉక్క‌పోత‌కు గురైన జ‌నం.. సాయంత్రం స‌మ‌యానికి చ‌ల్ల‌ని చిరుగాలులు వీస్తూ చిరుజ‌ల్లులు కురియ‌డంతో న‌గ‌ర ప్ర‌జ‌లు ఆ వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదించారు.

ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్, కాచిగూడ, ఎల్‌బీన‌గ‌ర్‌, స‌రూర్‌న‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట్‌, చార్మినార్, బీఎన్ రెడ్డి, నాగోల్, ఉప్ప‌ల్, అంబ‌ర్‌పేట్‌, వ‌న‌స్థ‌లిపురం, హ‌యత్‌న‌గ‌ర్‌ సహా పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి. మరోవైపు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్లే వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

మ‌రో గంట‌లో ఈ ప్రాంతాల్లో వ‌ర్షం..

వికారాబాద్ జిల్లాలో వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీని ప్ర‌భావం న‌గ‌రానికి తాకే అవ‌కాశం ఉంది. మ‌రో గంట‌లో అత్తాపూర్, రాజేంద్ర‌న‌గ‌ర్, బండ్ల‌గూడ జాగీర్, చార్మినార్, బ‌హ‌దూర్‌పురా, బాలాపూర్‌, కిష‌న్ బాగ్‌, చాంద్రాయ‌ణ‌గుట్ట‌, బార్క‌స్‌లో వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ వెద‌ర్‌మ్యాన్ త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement