త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad-Vijayawada Highway | నడిరోడ్డుపై పల్టీ కొట్టిన లారీ.. విజయవాడ హైవేపై 6 కిమీల మేర ట్రాఫిక్ జామ్

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ ప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని ఇనాంగూడ వద్ద కట్టెల లోడుతో వెళ్తున్న లారీ పల్టీ కొట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

J

Hyderabad | Published On Jan 13, 2026, 1.10 pm IST

Hyderabad-Vijayawada Highway | నడిరోడ్డుపై పల్టీ కొట్టిన లారీ.. విజయవాడ హైవేపై 6 కిమీల మేర ట్రాఫిక్ జామ్

సంక్షిప్త సారాంశం

అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద కట్టెల లారీ పల్టీ కొట్టడంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై కట్టెలు పడిపోవడంతో ఔటర్ రింగ్ రోడ్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించే పనిలో ఉన్నారు.

Advertisement

Hyderabad-Vijayawada Highway | హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై (NH65) ప్రయాణిస్తున్న వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడ వద్ద జరిగిన లారీ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

అసలేం జరిగిందంటే?

మంగళవారం ఉదయం కట్టెల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న ఒక లారీ ఇనాంగూడ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో పాటు, అందులోని కట్టెలన్నీ రహదారిపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

6 కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు

ఈ ప్రమాదం కారణంగా ఇనాంగూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎగ్జిట్ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పండగ రద్దీతో ఇప్పటికే హైవే రద్దీగా ఉండగా, ఈ ప్రమాదం తోడవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రంగంలోకి పోలీసులు

సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని, చెల్లాచెదురుగా పడిన కట్టెలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement