త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Private School | ఇంట‌ర్వ్యూకి పిలిచి.. యువ‌తిపై లైంగిక వేధింపులు

Private School | ప్రైవేట్ స్కూల్‌లో (Private School) ఉద్యోగం అంటూ ఓ యువ‌తిని పిలిచాడు.. ఇంట‌ర్వ్యూకి (Interview) వ‌చ్చిన ఆమెకు మాయ మాట‌లు చెప్పి లోబ‌ర్చుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. అతిక‌ష్టంగా అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డిన ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

G

Hyderabad | Published On Jan 24, 2026, 2.32 pm IST

Private School | ఇంట‌ర్వ్యూకి పిలిచి.. యువ‌తిపై లైంగిక వేధింపులు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ప్రైవేట్ స్కూల్‌లో (Private School) ఉద్యోగం అంటూ ఓ యువ‌తిని పిలిచాడు.. ఇంట‌ర్వ్యూకి (Interview) వ‌చ్చిన ఆమెకు మాయ మాట‌లు చెప్పి లోబ‌ర్చుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. అతిక‌ష్టంగా అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డిన ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

ఫ‌తేన‌గ‌ర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉద్యోగాల కోసం ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. దానిని చూసిన ఓ యువ‌తి ఇంట‌ర్వ్యూ కోసం ఈ నెల 21న‌ స్కూల్‌కి వెళ్లింది. పాఠ‌శాల క‌ర‌స్పాండెంట్ ఆమెను ఇంట‌ర్వ్యూ చేశాడు. నెల‌కు రూ.21 వేల జీతం ఇస్తాన‌ని, ఫోన్ కాల్స్ అటెండ్ చేయాల‌ని, విజిట‌ర్ల‌తో మాట్లాడాల‌ని చెప్పాడు. త‌న‌కు పీఏగా కూడా ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని చెబుతూ త‌న‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. గ‌దికి లాక్ చేసి లైంగికంగా వేధించాడ‌ని, ఇదంతా త‌న ఫోన్‌లో రికార్డు చేయాల‌ని ప్ర‌య‌త్నించ‌డంతో లాక్కున్నాడ‌ని బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన స‌న‌త్‌న‌గ‌ర్ పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement