త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

వనస్థలిపురంలో దారుణం.. మూడు నెలల గర్భిణీని కిరాతకంగా కత్తులతో పొడిచి చంపిన మాజీ భర్త

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా మాజీ భర్త ఆమెను కిరాతకంగా హతమార్చాడు. కత్తులు, పెట్రోల్ డబ్బాతో అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి చేసిన ఈ ఘాతుకం స్థానికంగా కలకలం రేపింది.

J

Hyderabad | Published On Feb 18, 2026, 5.14 pm IST

వనస్థలిపురంలో దారుణం.. మూడు నెలల గర్భిణీని కిరాతకంగా కత్తులతో పొడిచి చంపిన మాజీ భర్త
Advertisement
  • కత్తులు, పెట్రోల్ డబ్బాతో వచ్చి మాజీ భర్త ఘాతుకం

త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. విడాకులు ఇచ్చి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కక్షతో, మూడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా మాజీ భర్త ఓ మహిళను కిరాతకంగా హతమార్చాడు. వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.

అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సునీత నివాసం ఉంటోంది. ఆమెకు గతంలో మహేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది క్రితం విడాకులు తీసుకున్నారు. అనంతరం సునీత, శ్రీనాథ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి.

Pregnant Woman Brutally Murdered by Ex-Husband in Hyderabad

పక్కా ప్లాన్‌తో ఎంట్రీ..

తనకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, తనపై కేసులు పెట్టి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుందన్న కోపం మహేష్‌లో రగిలిపోతోంది. దీంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రెండు బ్యాగుల్లో కత్తులు, పెట్రోల్ డబ్బా పెట్టుకుని సునీత అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

అడ్డువస్తే పెట్రోల్ పోసి తగలబెడతా..

నేరుగా సునీత ఇంట్లోకి చొరబడిన మహేష్.. ఆమెపై దాడికి దిగాడు. అడ్డువచ్చేందుకు ప్రయత్నించిన వారిని "ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతా" అని బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తులతో సునీతను అతి దారుణంగా పొడిచి చంపేశాడు.

పోలీసుల అదుపులో నిందితుడు

హత్య అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన మహేష్‌ను అపార్ట్‌మెంట్ వాసులు, స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకోవడం, తన కెరీర్ నాశనం చేసిందన్న అక్కసుతోనే ఈ హత్య చేసినట్లు నిందితుడు ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు సమాచారం. గర్భిణిని హత్య చేసిన తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

[video width="848" height="478" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/02/WhatsApp-Video-2026-02-18-at-15.43.34.mp4"][/video]

[video width="478" height="850" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/02/WhatsApp-Video-2026-02-18-at-15.43.33.mp4"][/video]

Advertisement
Advertisement