Lallaguda Cases | దొంగతనం కేసులో మైనర్‌కు శిక్ష.. రెండేళ్ల బాలుర ప్రత్యేక గృహానికి పంపాలని ఆదేశం
Lallaguda Cases | లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే అధికారుల క్వార్టర్స్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ నేరస్థుడికి న్యాయస్థానం రెండేళ్ల శిక్ష విధించింది. 16 ఏళ్ల బాలుడిని గాజులరామారంలోని ప్రభుత్వ బాలుర ప్రత్యేక గృహానికి రెండేళ్ల పాటు పంపాలని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.
Lallaguda Cases | లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే అధికారుల క్వార్టర్స్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ నేరస్థుడికి న్యాయస్థానం రెండేళ్ల శిక్ష విధించింది. 16 ఏళ్ల బాలుడిని గాజులరామారంలోని ప్రభుత్వ బాలుర ప్రత్యేక గృహానికి రెండేళ్ల పాటు పంపాలని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మైనర్ గతంలో కూడా పలు ఆస్తి సంబంధిత నేరాల్లో పాలుపంచుకున్నాడు. ఇటీవల లాలాగూడ పరిధిలోని రైల్వే అధికారుల బంగ్లాళ్లోకి చొరబడి నగదు, ఇతర విలువైన వస్తువులను అపహరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
సంఘటనా స్థలంలో దొరికిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మైనర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరుచగా. నాంపల్లిలోని అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ వీ సౌమ్య తీర్పును వెలువురించారు. బాలుడిపై అభియోగాలు రుజువైన నేపథ్యంలో గాజులరామారంలోని ప్రభుత్వ బాలుర ప్రత్యేక గృహానికి రెండేళ్ల పాటు ఉంచాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. బాలుడిపై గతంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని ముషీరాబాద్, సనత్‌నగర్, చెర్లపల్లి, ఓయూ సిటీ, లాలాగూడ పోలీస్ స్టేషన్లలో కలిపి మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయని లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బీ రవికిరణ్ తెలిపారు. కేసులను సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీసులను ఆయన అభినందించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!
- ●MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల
- ●Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?
- ●Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్టర్‌తో వివాదం - దిగొచ్చిన ధృవ్ విక్రమ్
- ●Bionic Robot Fish | నీటిలో అచ్చం నిజమైన చేపలా ఈదుతున్న రోబో.. వీడియో వైరల్

Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్

Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!

MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల

Mumbai Desalination Plant | సముద్రపు నీరే ఇక తాగునీరు.. రూ.4,007 కోట్లతో ముంబై భారీ ప్రాజెక్ట్.. ఎలా పనిచేస్తుందంటే?






