త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Power Cut | ఉద‌యం 10 నుంచి.. ఈ ప్రాంతాల్లో ప‌వ‌ర్ క‌ట్‌

Power Cut | త్రినేత్ర‌.న్యూస్‌: నిర్వ‌హ‌ణ ప‌నుల కార‌ణంగా హైద‌రాబాద్‌లోని (Hyderabad) ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ కోత‌లు (Power Cut) విధించ‌నున్నారు. దీంతో బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోనుంది.

G

Hyderabad | Published On Feb 4, 2026, 6.24 am IST

Power Cut | ఉద‌యం 10 నుంచి.. ఈ ప్రాంతాల్లో ప‌వ‌ర్ క‌ట్‌
Advertisement

Power Cut | త్రినేత్ర‌.న్యూస్‌: నిర్వ‌హ‌ణ ప‌నుల కార‌ణంగా హైద‌రాబాద్‌లోని (Hyderabad) ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ కోత‌లు (Power Cut) విధించ‌నున్నారు. ఐఏఎస్ క్వార్ట‌ర్స్‌, కార్మిక‌న‌గ‌ర్ 11 కేవీ ఫీడ‌ర్లు ఈఎస్ఐ, ఎస్పీఆర్ హిల్స్ స‌బ్‌స్టేష‌న్ల ప‌రిధిలో మ‌మ్మ‌త్తులు జ‌రుగుతున్నాయి.

ఈనేప‌థ్యంలో బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ఈస్ట్ శ్రీనివాస్ కాల‌నీ, 2ఆర్‌టీ, ఎస్ఆర్ న‌గ‌ర్ బ‌స్టాప్ వెనుక వైపు, గాయ‌త్రీన‌గ‌ర్‌, మాజీ ఎమ్మెల్యే జ్ఞానేశ్వ‌ర్ రావు ఇంటి ప‌రిస‌ర ప్రాంతాల్లో క‌రెంటు కోత‌లు విధించ‌నున్నారు. అదేవిధంగా కుంద‌న్‌బాగ్‌, మైత్రీవ‌నం స‌బ్‌స్టేష‌న్ల ప‌రిధిలో మ‌ర‌మ్మ‌తుల వ‌ల్ల మ‌ధ్యాహ్నం ఐఏఎస్‌, ఐపీఎస్ క్వార్ట‌ర్స్‌, మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్‌, గాయ‌త్రీన‌గ‌ర్ ప్రాంతాల్లో స‌ర‌ఫ‌రా నిలిపివేయ‌నున్నారు. ఈమేర‌కు విద్యుత్ అధికారులు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement