Mokila | మోకిలా, బాచుపల్లిలో.. ఒక్కో ప్లాట్ ధర ఎంతో తెలుసా?
Mokila | హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో మోకిలా, బాచుపల్లి లేఅవుట్లలోని 70 నివాస ప్లాట్లకు బుధవారం నిర్వహించిన ఈ-వేలానికి గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది.
Mokila | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో మోకిలా, బాచుపల్లి లేఅవుట్లలోని 70 నివాస ప్లాట్లకు బుధవారం నిర్వహించిన ఈ-వేలానికి గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ-వేలంలో మొత్తం 57 ప్లాట్లు విక్రయమయ్యాయి. ఇందులో మోకిలా లేఅవుట్‌లో 32 ప్లాట్లు విక్రయించగా, చదరపు గజానికి గరిష్ఠంగా రూ.87,500 ధర పలికింది. చదరపు గజానికి సగటు వేలం ధర రూ.63,511గా నమోదైంది. తద్వారా సుమారు రూ.66.48 కోట్ల ఆదాయం సమకూరింది. మోకిలా ప్రాంతానికి ఉన్న ఆకర్షణను ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి.
బాచుపల్లి లేఅవుట్‌లో 25 ప్లాట్లు విక్రయమయ్యాయి. చదరపు గజానికి గరిష్ఠంగా రూ.67,500 ధర పలికగా, సగటు వేలం ధర రూ.51,991గా నమోదైంది. ఈ వేలం ద్వారా సుమారు రూ.35.03 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది బాచుపల్లి ప్రాంతానికి ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది.
హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బిడ్డర్లు ఈ వేలంలో పాల్గొన్నారు. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లపై మార్కెట్‌లో ఉన్న బలమైన విశ్వాసంతో పాటు, సక్రమంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన నివాస ప్రాంతాలకు పెరుగుతున్న డిమాండ్‌కు ఈ స్పందన నిదర్శనంగా నిలిచింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



