త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Operation Octopus | ఆపరేషన్‌ ఆక్టోపస్‌.. 16 రాష్ట్రాల్లో సైబర్‌క్రైమ్‌ పోలీసుల సోదాలు, 104 మంది అరెస్ట్‌

Operation Octopus | రోజురోజుకు విస్త‌రిస్తున్న‌ సైబర్ నేరగాళ్ల ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట‌వేసేందుకు హైద‌రాబాద్ (Hyderabad police) సైబర్‌క్రైమ్‌ పోలీసులు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఆపరేషన్‌ ఆక్టోపస్ (Operation Octopus) పేరుతో 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వ‌హించారు.

G

Hyderabad | Published On Feb 25, 2026, 7.04 am IST

Operation Octopus | ఆపరేషన్‌ ఆక్టోపస్‌.. 16 రాష్ట్రాల్లో సైబర్‌క్రైమ్‌ పోలీసుల సోదాలు, 104 మంది అరెస్ట్‌
Advertisement

Operation Octopus | త్రినేత్ర‌.న్యూస్‌: రోజురోజుకు విస్త‌రిస్తున్న‌ సైబర్ నేరగాళ్ల ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట‌వేసేందుకు హైద‌రాబాద్ (Hyderabad police) సైబర్‌క్రైమ్‌ పోలీసులు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఆపరేషన్‌ ఆక్టోపస్ (Operation Octopus) పేరుతో 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వ‌హించారు. పెట్టుబడులు, డిజిటల్‌ అరెస్ట్‌లు, ట్రేడింగ్ పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టడంలో సహకరించిన 104 మంది కేటుగాళ్ల‌ను అరెస్ట్ చేశారు.

ఎక్క‌డో వందల కిలోమీటర్ల దూరంలో ఉండి అక్రమాలకు పాల్పడుతున్న సైబ‌ర్ క్రిమిన‌ల్స్‌ను అడ్డుకునేందుకు ఆపరేషన్‌ ఆక్టోపస్‌ను చేప‌ట్టామ‌ని సీపీ సజ్జనర్ తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బందితో 32 బృందాలు ఏర్పాటు చేశామ‌న్నారు. బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్‌ నంబర్ల ఆధారంగా నిందితుల ఆచూకీ కనిపెట్టామ‌ని, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకతో స‌హా 16 రాష్ట్రాల్లో ఉన్న‌ సైబర్‌ నేరాల హాట్‌స్పాట్లపై దాడులు నిర్వహించాని వెల్ల‌డించారు.

గ‌త 10 రోజుల్లో 104 మందిని అరెస్ట్ చేశామ‌ని, వారిలో 86 మంది మ్యూల్‌ ఖాతాదారులు, 17 మంది మోసగాళ్లకు అవసరమైన వస్తువులు, సమాచారం చేరవేసేవారు, బంధన్‌ బ్యాంక్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ ఒకరున్నార‌ని తెలిపారు. నిందితులకు దేశవ్యాప్తంగా 1,055 సైబర్‌ నేరాలతో సంబంధం ఉన్నట్టు గుర్తించామ‌ని చెప్పారు. వారి వ‌ద్ద‌ సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ల్యాప్‌టాప్‌లు, రూ.36 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామ‌ని, ఈ మోసాల్లో బాధితులు రూ.127 కోట్లు నష్టపోయార‌ని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement