Petrol Bunks | హైదరాబాద్‌లో మరోసారి పెట్రోల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలైన్లు
Petrol Bunks | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో మరోసారి పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే పలు పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. ద్విచక్ర వాహనదారులతో పాటు ఫోర్ వీలర్, త్రీ వీలర్ వాహనాలు కూడా బారులు తీరాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీని క్రమబద్దీకరించేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వస్తుంది.
ఇక కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా పెట్రోల్ బంకుల వద్దకు వచ్చిన జనం వెనుతిరిగిపోతున్నారు. తెరిచి ఉన్న పెట్రోల్ బంకుల వద్ద ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు వాహనదారులు ఎగబడుతున్నారు.

ఇది ఇలా ఉంటే తెలంగాణ పౌర సరఫరాల అధికారులు మాత్రం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై నిన్న అధికారిక ప్రకటన వెలువడింది కూడా. సోషల్ మీడియాలో ఇంధనం దొరకదని వస్తున్న వార్తలు పూర్తిగా పుకార్లేనని, ప్రజలు వాటిని నమ్మవద్దని కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రయాణికులు, రవాణా రంగం, రైతులకు అవసరమైనంత ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వెల్లడించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆయిల్ కంపెనీలతో కలిసి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో రోజుకు 7,443 కిలోలీటర్ల పెట్రోల్, 11,081 కిలోలీటర్ల డీజిల్ సరఫరా అవుతుండగా, మొత్తం 18,524 కిలోలీటర్ల ఇంధనం నిరంతరంగా అందుబాటులో ఉందని పేర్కొంది. ఇంధనం అందరికీ సకాలంలో చేరేందుకు ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని, అనవసరంగా భయపడి పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీయొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రమాదాలకు దారితీసేలా ఇళ్లలో అక్రమంగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకోవద్దని హెచ్చరించింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు ఓపికతో వ్యవహరించాలని, పెట్రోల్ బంక్ సిబ్బంది, స్థానిక పోలీసులకు సహకరించాలని సూచించింది. ప్రభుత్వం విడుదల చేసే అధికారిక సమాచారాన్నే నమ్మాలని స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





