త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Petrol | హైద‌రాబాద్‌లో పెట్రోల్ కొర‌త‌.. ద‌ర్శ‌న‌మిస్తున్న నో స్టాక్ బోర్డులు

Petrol | హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా పెట్రోల్ కొర‌త ఏర్ప‌డింది. దీంతో పెట్రోల్ బంకుల వ‌ద్ద వాహ‌న‌దారులు బారులు తీరారు. డీజిల్ మాత్ర‌మే ఉందంటూ బంకుల ముందు బోర్డులు వెలిశాయి.

S

Hyderabad | Published On Mar 24, 2026, 4.34 pm IST

Petrol | హైద‌రాబాద్‌లో పెట్రోల్ కొర‌త‌.. ద‌ర్శ‌న‌మిస్తున్న నో స్టాక్ బోర్డులు
Advertisement

Petrol | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా పెట్రోల్ కొర‌త ఏర్ప‌డింది. దీంతో పెట్రోల్ బంకుల వ‌ద్ద వాహ‌న‌దారులు బారులు తీరారు. డీజిల్ మాత్ర‌మే ఉందంటూ బంకుల ముందు బోర్డులు వెలిశాయి.

అంబ‌ర్‌పేట్, నాగోల్, ఉప్ప‌ల్, బోడుప్ప‌ల్ ప్రాంతాల్లో పెట్రోల్ కొర‌త ఏర్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ప‌లు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక పెట్రోల్ ఉన్న బంకుల వ‌ద్ద వాహ‌నాలు బారులు తీరాయి. కొన్ని చోట్ల అడిగిన దాని కంటే త‌క్కువ‌గానే పెట్రోల్ నింపుతున్నారు. దీంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఆటో డ్రైవ‌ర్ల నిరీక్ష‌ణ‌

సీఎన్‌జీ గ్యాస్ కొర‌త ఏర్ప‌డింది. దీంతో హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు సీఎన్‌జీ ఫిల్లింగ్ సెంట‌ర్ల వ‌ద్ద ఆటో డ్రైవ‌ర్లు నిరీక్షిస్తున్నారు. కిలోమీట‌ర్ల మేర ఆటోలు బారులు తీరాయి. ఇక సీఎన్జీ కొర‌త ఉంద‌ని ఆటో డ్రైవ‌ర్ల‌కు ఫిల్లింగ్ స్టేష‌న్ నిర్వాహ‌కులు చెబుతున్నారు. దీంతో ఆటోలు న‌డ‌ప‌లేక‌పోతున్నామ‌ని డ్రైవ‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement