త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nampally Numaish | నాంప‌ల్లి నుమాయిష్‌కు ఎవ‌రూ రావొద్దు.. క‌లెక్ట‌ర్ సూచ‌న‌

Nampally Numaish | నాంప‌ల్లిలోని బ‌చ్చాస్ క్రిస్ట‌ల్ ఫ‌ర్నీచ‌ర్ షాపులో శనివారం మ‌ధ్యాహ్నం అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. భ‌వ‌నం గ్రౌండ్ ఫ్లోర్‌లో చెల‌రేగిన మంట‌లు నాలుగో అంత‌స్తుకు వ్యాపించాయి.

S

Hyderabad | Published On Jan 24, 2026, 5.48 pm IST

Nampally Numaish | నాంప‌ల్లి నుమాయిష్‌కు ఎవ‌రూ రావొద్దు.. క‌లెక్ట‌ర్ సూచ‌న‌
Advertisement

Nampally Numaish | త్రినేత్ర‌.న్యూస్ : నాంప‌ల్లిలోని బ‌చ్చాస్ క్రిస్ట‌ల్ ఫ‌ర్నీచ‌ర్ షాపులో శనివారం మ‌ధ్యాహ్నం అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. భ‌వ‌నం గ్రౌండ్ ఫ్లోర్‌లో చెల‌రేగిన మంట‌లు నాలుగో అంత‌స్తుకు వ్యాపించాయి. దీంతో ప్రాంత‌మంతా ఆందోళ‌న‌క‌రంగా మారింది. భారీగా వాహ‌నాలు నిలిచిపోవ‌డంతో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.ఈ క్ర‌మంలో వాహ‌నాల‌ను వేరే మార్గాల్లో మ‌ళ్లిస్తున్నారు.

నాంప‌ల్లి నుమాయిష్‌కు వ‌చ్చే వారిని కూడా హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్, సీపీ అప్ర‌మ‌త్తం చేశారు. ఇవాళ ఒక్క‌రోజు నుమాయిష్‌కు వ‌చ్చే వారు త‌మ ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకోవాల‌ని కోరారు. వాహ‌న‌దారులు, స్థానిక ప్ర‌జ‌లు పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement