Fake Number Plate | ఎన్నేశాలేసినా చివరికి చిక్కాల్సిందే.. నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న కేటుగాడి అరెస్ట్
Fake Number Plate | ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోడానికి, ఫైనాన్స్ ఏజెన్సీలను తప్పుదోవ పట్టించడానికి చట్టవిరుద్ధంగా ఇంకో వ్యక్తి ద్విచక్ర వాహన నంబర్ ప్లేట్‌ను బిగించుకొని తిరుగుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు ఆట కట్టించారు. మెహదీపట్నం సాయి నగర్‌కు చెందిన సుసేందర్ చిదంబరను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ తెలిపారు.
- వేరే వ్యక్తి నంబర్ ప్లేట్ బిగించుకొని తిరుగుతున్న మోసగాడు
- ఆట కట్టించిన మెహిదీపట్నం పోలీసులు
Fake Number Plate | త్రినేత్ర.న్యూస్: ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోడానికి, ఫైనాన్స్ ఏజెన్సీలను తప్పుదోవ పట్టించడానికి చట్టవిరుద్ధంగా ఇంకో వ్యక్తి ద్విచక్ర వాహన నంబర్ ప్లేట్‌ను బిగించుకొని తిరుగుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు ఆట కట్టించారు. ఈ మోసానికి పాల్పడుతున్న హైదరాబాద్ మెహదీపట్నం సాయి నగర్‌కు చెందిన సుసేందర్ చిదంబరం కటకటాలపాలయ్యాడు. ఇతడిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ తెలిపారు.
పోలీసుల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ మెహదీపట్నం సాయి నగర్‌కు చెందిన సుసేందర్ చిదంబరం (30) అనే వ్యక్తి 2017లో ఒక హోండా యాక్టివా (Honda Activa) ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు కట్టకుండా, ఆర్టీఓ (RTO) కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించకుండా యథేచ్చగా తిరుగుతున్నాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు వచ్చే చలానాల నుండి తప్పించుకోవడానికి, ఫైనాన్స్ కంపెనీల కళ్లు కప్పడానికి అతను ఈ ప్లాన్ వేసుకున్నాడు.
నిజామాబాద్ టౌన్ కసాబ్ గల్లీకి చెందిన ఎ. అర్జున్ అనే వ్యక్తికి చెందిన పియాజియో అప్రిలియా (Piaggio Aprilia) ద్విచక్ర వాహనం నంబర్ (TS09FF7061)ను దొంగతనంగా సేకరించాడు. ఆ నంబర్ ప్లేటును తన యాక్టివా వాహనానికి బిగించుకున్నాడు. నిందితుడు నగరంలో ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో ఆ చలానాలన్నీ యజమాని అర్జున్‌కు వెళ్లడం ప్రారంభించాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో ఈ నకిలీ నంబర్ ప్లేట్ వ్యవహారం వెలుగుచూసింది. తక్షణమే స్పందించిన మెహదీపట్నం పోలీసులు నిందితుడు సుసేందర్ చిదంబరంను అదుపులోకి తీసుకున్నారు. సదరు వాహన అసలైన నంబర్ TS10YTR5376 గా పోలీసులు గుర్తించారు.
ఈ మేరకు మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై క్రైమ్ నంబర్ 141/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4), మోటారు వాహనాల చట్టం (M.V Act) లోని సెక్షన్లు 192, 180, 80(a) r/w 177, 179 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిందితుడికి BNSS సెక్షన్ 35(3) (పాత Cr.P.C సెక్షన్ 41) కింద నోటీసులు జారీ చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జాయింట్ కమిషనర్ తెలిపారు.
ఫేక్ నంబర్ ప్లేట్లు వాడితే కఠిన చర్యలు: ట్రాఫిక్ జాయింట్ సీపీ
జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ వాహనదారులను హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో నకిలీ, ట్యాంపరింగ్ చేసిన లేదా ఇతరుల నంబర్ ప్లేట్లను వాడటం మోటారు వాహనాల చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం అత్యంత తీవ్రమైన శిక్షార్హమైన నేరమని స్పష్టం చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచుతోందని, ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని సులభంగా గుర్తిస్తామని చెప్పారు. వాహన నంబర్ ప్లేట్‌ను ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే కింది వెబ్‌సైట్లు, వాట్సాప్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని జాయింట్ సీపీ కోరారు.
- వెబ్‌సైట్: https://echallan.tspolice.gov.in
- ఇమెయిల్ ఐడీ: echallanhelpdesk.hyd@gmail.com
- ట్రాఫిక్ ఈ-చలాన్ వాట్సాప్ నంబర్: 87126 61690
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




