Neopolis | నియోపోలిస్‌లో ఎకరా రూ.120 కోట్లు.. హెచ్‌డీఏ ఈ-వేలంలో రికార్డు స్థాయి ధర
Neopolis | హైదరాబాద్‌లో భూములను ప్రభుత్వం మరోసారి అమ్ముతున్నది. గండిపేట్ మండలం కోకాపేట పరిధిలోని నియోపోలిస్ (Neopolis) లేఅవుట్, గోల్డెన్ మైల్ సైట్-1లోని ప్లాట్ల వేలంలో హెచ్ఎండీఏ (HMDA) నిర్వహించిన ఈ-వేలంలో (HMDA e-Auction) రికార్డు స్థాయిలో బిడ్లు నమోదయ్యాయి.
Neopolis | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో భూములను ప్రభుత్వం మరోసారి అమ్ముతున్నది. గండిపేట్ మండలం కోకాపేట పరిధిలోని నియోపోలిస్ (Neopolis) లేఅవుట్, గోల్డెన్ మైల్ సైట్-1లోని ప్లాట్ల వేలంలో హెచ్ఎండీఏ (HMDA) నిర్వహించిన ఈ-వేలంలో (HMDA e-Auction) రికార్డు స్థాయిలో బిడ్లు నమోదయ్యాయి. నియోపోలిస్ లేఅవుట్లోని 4.59 ఎకరాల ప్లాట్‌కు ఎకరా రూ.120 కోట్ల చొప్పున బిడ్ దాఖలైంది. అలాగే గోల్డెన్ మైల్ సైట్-1లోని 0.70 ఎకరాల ప్లాట్‌కు అత్యంత భారీ స్పందన లభించింది. ఎకరాకు రూ.70 కోట్లుగా నిర్ణయించగా.. అత్యధిక బిడ్ ధర రూ.115 కోట్లుగా నమోదైంది.
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు కొనసాగుతున్న డిమాండ్‌కు ఇది నిదర్శనంగా నిలిచింది. ఈ రెండు ప్లాట్లు కోకాపేట్లో (Kokapet) వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ (ORR), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ (HITEC) సిటీ వంటి ప్రధాన ప్రాంతాలకు అద్భుతమైన రవాణా అనుసంధానం కలిగి ఉన్నాయి. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని అభివృద్ధి చెందిన గ్రోత్ కారిడార్‌లో వీటి స్థానం కారణంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి మరియు పెట్టుబడులకు వీటి ఆకర్షణ మరింత పెరుగుతున్నది.
సంబంధిత వార్తలు

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026

Fab City Land Scam | ఫ్యాబ్ సిటీ భూ స్కాంపై.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టుకు హ్యాట్సాఫ్
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



