త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Divija Prabhakar | హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ ప్ర‌భాక‌ర్ కూతురు – వారం గ్యాప్‌లో రెండు సినిమాలు రిలీజ్‌

బుల్లితెర మెగాస్టార్ ప్ర‌భాక‌ర్ కూతురు దివిజ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఆమె క‌థానాయిక‌గా న‌టించిన వెంక‌ట్రామ‌య్య‌గారి తాలూకాతో పాటు హే చికితా సినిమాలు వారం గ్యాప్‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి.

N

Entertainment | Published On Jun 28, 2026, 1.38 pm IST

Divija Prabhakar | హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ ప్ర‌భాక‌ర్ కూతురు – వారం గ్యాప్‌లో రెండు సినిమాలు రిలీజ్‌
Advertisement

Divija Prabhakar | తెలుగు సీరియ‌ల్స్‌తో బుల్లితెర మెగాస్టార్‌గా గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్ర‌భాక‌ర్‌. సీరియ‌ల్స్‌లోనే కాకుండా కొన్ని సినిమాల్లో న‌టించాడు. ప్ర‌భాక‌ర్ బాట‌లోనే ఆయ‌న కొడుకు చంద్ర‌హాస్ ఇటీవ‌లే హీరోగా మారాడు. తాజాగా ప్ర‌భాక‌ర్ ఫ్యామిలీ నుంచి ఆయ‌న కూతురు దివిజ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. దివిజ క‌థానాయిక‌గా న‌టించిన రెండు సినిమాలు వారం గ్యాప్‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే?

వెంక‌ట్రామ‌య్య‌గారి తాలూకా...

దినేష్ కుమార్‌, దివిజ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న వెంక‌ట్రామ‌య్య‌గారి తాలూకా మూవీ జూలై 18న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు స‌తీష్ ఆవాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డాక్ట‌ర్ కావాల‌ని అనుకున్న దివిజ వెంక‌ట్రామ‌య్య‌గారి తాలూకా సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో తొలి అడుగు వేయ‌బోతుంద‌ని ప్ర‌భాక‌ర్ అన్నారు. ఉమ్మ‌డి కుటుంబం గొప్ప‌త‌నంతో ఈ సినిమాను తెర‌కెక్క‌బోతుంది.

రిలీజ్ డిలే

మాన‌వ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా ఎలా మారుతున్నాయ‌నే మెసేజ్‌ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు. ఇందులో ప‌ల్లెటూరి అమ్మాయిగా దివిజ క‌నిపించ‌బోతుంది. ఈ సినిమాలో ముర‌ళీధ‌ర్‌గౌడ్, సుధ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.చాలా రోజుల క్రిత‌మే ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల రిలీజ్ డిలే అయ్యింది. దివిజ ప్ర‌భాక‌ర్ అంగీక‌రించిన ఫ‌స్ట్ మూవీ ఇదే.

హే చికితా...

దివిజ హీరోయిన్‌గా న‌టిస్తోన్న రొమాంటిక్ కామెడీ మూవీ హే చికితా జూలై 24న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది. అభినవ్ మ‌ణికంఠ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు ధ‌న్‌రాజ్ లెక్క‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డైరెక్ట‌ర్ గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రైతే రాజు అనే కాన్సెప్ట్‌కు ప‌వ‌నిజం అనే అంశాలు జోడించి ఈ సినిమాను రూపొందించారు. ఓ ప‌ల్లెటూరిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ఎలా మార్పు తీసుకొచ్చార‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.  21 రోజుల్లోనే సింగిల్ షెడ్యూల్‌లోనే ఈ సినిమాను పూర్తిచేసిన‌ట్లు దివిజ చెప్పింది. ఈ రెండు సినిమాల‌తో పాటు దివిజ ప్ర‌భాక‌ర్ మ‌రో తెలుగు మూవీని కూడా అంగీక‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

 

Advertisement
Advertisement