Sridhar Babu | మెట్రో స్టేషన్ల వద్ద ప్రైవేట్ వాహనాల సంఖ్య తగ్గించండి..: మంత్రి శ్రీధర్ బాబు
Sridhar Babu | మెట్రో స్టేషన్లు ఉన్న ప్రతిచోటా తీవ్ర అస్తవ్యస్థ పరిస్థితికి ప్రైవేటు వాహనాలు కారణమవుతున్నాయని, వీలైనవరకు వాటి సంఖ్యను తగ్గించాలని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) పోలీసులకు సూచించారు. ప్రజారవాణా వినియోగాన్ని పెంచాల్సి న అవసరం ఉందని చెప్పారు.
Sridhar Babu | త్రినేత్ర న్యూస్: మెట్రో స్టేషన్లు ఉన్న ప్రతిచోటా తీవ్ర అస్తవ్యస్థ పరిస్థితికి ప్రైవేటు వాహనాలు కారణమవుతున్నాయని, వీలైనవరకు వాటి సంఖ్యను తగ్గించాలని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) పోలీసులకు సూచించారు. ప్రజారవాణా వినియోగాన్ని పెంచాల్సి న అవసరం ఉందని చెప్పారు. ఇందులోభాగంగా పౌరులు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం, పోలీసులు అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు. కార్‌పూలింగ్, షేర్డ్ మొబిలిటీ వంటి విధానాలు సాకారం కావాలంటే పౌరుల సహకారం, కృషి అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు సాగిన `సైబరాబాద్ మూవ్స్ 2026` (Cyberabad Moves 2026) సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన సంస్కృతికి అనుగుణంగా మలచుకోగల అనేక అంతర్జాతీయ ఉదాహరణలు ఉన్నాయన్నారు.
మంత్రి సూచనకు సైబరాబాద్ సీపీ రమేశ్ (CP Ramesh) స్పందిస్తూ.. వారం రోజుల్లోగా ‘కాంట్రా-ఫ్లో’ (ఎదురు దిశ) ప్రజా రవాణా ప్రయోగాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నామని వెల్లడించారు. సైబరాబాద్ మూవ్స్ సదస్సుకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఉత్సాహం కనిపించిందన్నారు. డబ్ల్యూఆర్ఐ ఇండియా (WRI India) ప్రదర్శనలో గణాంకాలను దృశ్యరూపంలో ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుందని, క్యూర్ (CURE) ప్రాంతంలో దాదాపు 70 వేల డెడ్ ఎండ్‌లు (ముందుకు దారిలేని మార్గాలు) ఉన్నాయనే గణాంకం తన మనసులో నిలిచిపోయిందని వివరించారు. `బెర్లిన్ గోడలా వీటిని బద్దలు కొట్టాలి. వచ్చే ఏడాది కాలంలో కనీసం 10 శాతం తగ్గించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి` అని చెప్పారు. కీలక కారిడార్లలో బస్సుల విశ్వసనీయతను మెరుగుపరచి, రద్దీని తగ్గించేందుకు వారం రోజుల్లోగా కాంట్రా-ఫ్లో ప్రజా రవాణా ప్రయోగాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
పాదచారులు సురక్షితంగా నడవగలిగే, జీవనోపాధులు వర్ధిల్లే వీధుల రూపకల్పన ప్రాధాన్యతను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ డాక్టర్ జీ. సృజన వివరించారు. సైబరాబాద్‌లో ఇప్పటికే 374 కి.మీ. మేర పాదచారుల బాటలు (ఫుట్‌పాత్‌లు) అభివృద్ధి చెందాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 500 కి.మీ. నడకయోగ్య బాటలను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు.

విజయవంతంగా సదస్సు..
మూడు రోజుల పాటు సాగిన `సైబరాబాద్ మూవ్స్ 2026` సదస్సు విజయవంతంగా ముగిసింది. సురక్షితమైన, మెరుగైన అనుసంధానం కలిగిన, సమ్మిళిత, సుస్థిర సైబరాబాద్ (Cyberabad) కోసం సామూహిక దార్శనికతను రూపొందించడమే లక్ష్యంగా జరిగిన ఈ సదస్సులో ప్రభుత్వ నేతలు, అంతర్జాతీయ నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు, క్షేత్రస్థాయి సిబ్బంది, పౌరులు సహా 5,000 మందికి పైగా పాల్గొన్నారు. 15 ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ‘కార్పొరేట్ మొబిలిటీ అండ్ సస్టెయినబిలిటీ ప్రతిజ్ఞ’ (Corporate Mobility and Sustainability Pledge)పై సంతకం చేసి, 2027 నాటికి ఉద్యోగుల రాకపోకలకు వినియోగించే వాహనాలను 10 శాతం తగ్గిస్తామని కట్టుబడ్డాయి. బొగోటా నగర మాజీ మేయర్ ఎన్రిక్ పెనలోసా, ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశి వర్మ తమ అంతర్జాతీయ నైపుణ్యాన్ని పంచుకున్నారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్షేత్రస్థాయి సిబ్బంది, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, పౌరులు సాధారణంగా రవాణా చర్చల్లో వినిపించని తమ గళాన్ని ఈ వేదికపై వినిపించారు. నగర రవాణా వ్యవస్థ విజయాన్ని వాహనాల సంఖ్యతో కాకుండా, అది ప్రజలను ఎంత సమర్థంగా గమ్యానికి చేరుస్తుందనే అంశంతో కొలవాలనే ఉమ్మడి దార్శనికతతో సదస్సు ముగిసింది.
తాజావార్తలు
- ●Drunk and Drive Cases | వీకెండ్ తనిఖీలు.. పట్టుబడిన మందుబాబులు.. ఎన్ని కేసులు అయ్యాయంటే!
- ●Tirupparankundram | భక్తులకు గుడ్న్యూస్.. తిరుప్పరంకుండ్రం కొండపై డిసెంబర్ 15 దాకా దీపాలు వెలిగించొచ్చు!
- ●Rahul Gandhi | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి.. డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి
- ●Uttam Kumar Reddy | నాలుగో వంతు మంది చనిపోయారా.. తప్పిపోయారా?
- ●Global Summit | ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్పో.. 130 కంపెనీలు, సంస్థల భాగస్వామ్యం
- ●Chiranjeevi | ఆటో జానీ ఈజ్ బ్యాక్ - రూమర్లకు చెక్ పెట్టిన కాకా

Drunk and Drive Cases | వీకెండ్ తనిఖీలు.. పట్టుబడిన మందుబాబులు.. ఎన్ని కేసులు అయ్యాయంటే!

Tirupparankundram | భక్తులకు గుడ్న్యూస్.. తిరుప్పరంకుండ్రం కొండపై డిసెంబర్ 15 దాకా దీపాలు వెలిగించొచ్చు!

Rahul Gandhi | డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి.. డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి

Uttam Kumar Reddy | నాలుగో వంతు మంది చనిపోయారా.. తప్పిపోయారా?





