Sridhar Babu | మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు.. ఇది మీ జీవోనే : మంత్రి శ్రీధర్ బాబు
Sridhar Babu | మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు అని నిర్ధారిస్తూ మీరు జారీ చేసిన జీవోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తుందని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మూసీకి ఇరువైపులా బఫర్ జోన్ పరిధి 50 మీటర్లు ఉండాలని మీరే చెప్పారు.. అదే విషయాన్ని సభ దృష్టికి తీసుకువస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు.
Sridhar Babu | త్రినేత్ర.న్యూస్ : మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు అని నిర్ధారిస్తూ మీరు జారీ చేసిన జీవోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు కొనసాగిస్తుందని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మూసీకి ఇరువైపులా బఫర్ జోన్ పరిధి 50 మీటర్లు ఉండాలని మీరే చెప్పారు.. అదే విషయాన్ని సభ దృష్టికి తీసుకువస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పునరుజ్జీవంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు.
మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి డీపీఆర్ రెడీ చేయాలని మెయిన్ హార్ట్ అనే సంస్థకు 2024 డిసెంబర్‌లో అప్పగించాం. 2026 ఫిబ్రవరిలో మొదటి ఫేజ్‌కు సంబంధించిన డీపీఆర్ తయారైంది. అదే విధంగా ఫండింగ్ కోసం ఏడీబీకి ప్రతిపాదన పపంపించాం. వారు ప్రాథమికంగా సంతృప్తి చెందారు. వచ్చే బోర్డు మీటింగ్‌లో అఫ్రూవల్ వస్తుందని ఆశిస్తున్నాం. ఎస్టిమేషన్, డీపీఆర్‌కు సంబంధించి ఒప్పుకోకపోతే.. మనం ఇంకో సంస్థను సంప్రదిస్తాం. పీపీపీ ద్వారా లేదా ఏదో విధంగా ముందుకు పోతాం. వరల్డ్ బ్యాంకును సంప్రదిస్తాం. ఫైనాన్షియల్ ఏజెన్సీలను సంప్రదిస్తాం. మూసీ నదిని ప్రక్షాళన చేయడం తమ లక్ష్యం అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
మెయిన్ హార్ట్‌ను నిషేధించలేదు..
మెయిన్ హార్ట్ కంపెనీపై ఆరోపణలు సరికాదు. వారు అనేక ప్రాజెక్టులను ఇండియాలో చేపట్టారు. ఢిల్లీ ఏరోసిటీ, సింగపూర్, సౌదీ, ఖతార్‌లో చాలా ప్రాజెక్టులు చేపట్టారు. ఈ రోజు ప్రధానమైన సంస్థ అది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజు వరకు మెయిన్ హార్ట్‌ను నిషేధించలేదు. బ్లాక్ లిస్టులో పెట్టలేదు. అందుకే ఇచ్చామని శ్రీధర్ బాబు తెలిపారు.
32 ఎస్టీపీలు ప్రతిపాదించి.. 20 ఎస్టీపీలకు
గత ప్రభుత్వం మొత్తం 32 ఎస్టీపీలు ప్రతిపాదించి.. 20 ఎస్టీపీలకు సంబంధించిన పనులను మాత్రమే ప్రారంభించింది. ఇందులో 20 శాతం పనులు మాత్రమే అయ్యాయి. మిగతా 80 శాతం పనులు మేం పూర్తి చేసి ప్రారంభించుకుంటున్నాం. ఎస్టీపీలకు సంబంధించి 2023 డిసెంబర్ వరకు పనుల వివరాలను పంపిస్తాం. తదుపరి వివరాలను కూడా పంపిస్తామని మంత్రి పేర్కొన్నారు.
అది కూడా బఫర్ జోన్‌లో చేశారు..
మూసీ ప్రక్షాళనను మీరు మంచి హృదయంతో చేపట్టారు. ఒక పార్కు అభివృద్ధి చేశారు. అది కూడా బఫర్ జోన్‌లో చేశారు. చిన్న వరదకే కొట్టుకుపోయింది ట్రాక్. మంచి ఆలోచనలతో చేసి ఉండొచ్చు. కానీ సరైన విధంగా పనులు చేపట్టాలి. ప్రతి పైసా కూడా సరైన విధానంలో ఉపయోగించాలి. మేం మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతాం.. హైదరాబాద్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



