త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | అమ్మ పులి వచ్చే కథలా కేసీఆర్ మాటలు

పని చేయకపోతే తోలు తీసే పని ప్రజలది.. అందుకే బీఆర్ఎస్ తోలు పార్లమెంట్, బై ఎలెక్షన్లో, పంచాయితీ ఎన్నికల్లో తీశారు. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి బిఆర్ఎస్, కాంగ్రెస్ పాలమూరు జిల్లా పాలనపై చర్చ చేయాలి?

J

Hyderabad | Published On Dec 22, 2025, 6.46 pm IST

Vakiti Srihari | అమ్మ పులి వచ్చే కథలా కేసీఆర్ మాటలు
Advertisement

Vakiti Srihari | గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఇతర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. ఆదివారం నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంపై ఆయన మాట్లాడారు. గతంలో మీడియా అంటేనే తొక్కేస్తా అని మాట్లాడే కేసీఆర్.. నిన్న మీడియా మిత్రులకు రిక్వెస్ట్ అని అంటే చాలా సంతోషం అనిపించింది. కేసీఆర్‌కి మీడియా అంటే ఏంటో ఇప్పుడు గుర్తొచ్చింది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు.. ఏం మాట్లాడుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఏపీకి నిధులు తరలిపోతున్నాయి అని తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్ష గురించి కేసీఆర్ మాట్లాడుతారేమో అని అనుకున్నా కానీ పాతపురాణమే మొదలు పెట్టారు. ఉన్నట్టుండి పాలమూరుపై కేసీఆర్‌కి ప్రేమ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.

పాలమూరులో కేసీఆర్ కి ఊరు,పేరు లేకున్నా ఎంపీగా గెలిపించారు. 10 ఏళ్లలో పాలమూరుపై కేసీఆర్ కపట ప్రేమ చూపించి లేనిపోని అభూత కల్పనలు సృష్టించారు. ప్రజలు ఏం అంటారో అని సోయి లేకుండా కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో అబద్ధాలు మాట్లాడారు. సంఘం బండ, భూత్పూర్ లో ప్రాజెక్ట్‌లో బండ పగలకొడితే 20 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆలోచన కూడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. త్వరితగతిన కాళేశ్వరం పూర్తిచేయాలన్న తపన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఎందుకు కేసీఆర్‌కి లేదు? పాలమూరుపై కేసీఆర్ కి ప్రేమ లేకపోవడం వల్లేనే శాసనసభ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. రాబోయే రోజుల్లో ప్రతి ఊరికి పోయి టీవీ సీరియల్ లాగా ఎపిసోడ్ 1, 2 అనే ప్రచారాలు ఆపండి. పని చేయకపోతే తోలు తీసే పని ప్రజలది.. అందుకే బీఆర్ఎస్ తోలు పార్లమెంట్, బై ఎలెక్షన్లో, పంచాయితీ ఎన్నికల్లో తీశారు. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి బిఆర్ఎస్, కాంగ్రెస్ పాలమూరు జిల్లా పాలనపై చర్చ చేయాలి? కాంగ్రెస్ పార్టీ హయంలో ప్రాజెక్టుల కోసం భూసేకరణకు నిధులు ఇస్తున్నాం. అవగాహన లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. నిధులు కేటాయించకుండా, భూ సేకరణ చేయకుండా తప్పు మీద తప్పు చేసింది కేసీఆర్. మీ తోలు మీ కుటుంబ సభ్యులు కవిత తీస్తున్నారు ముందు అది చూసుకోండి. లక్షల కోట్ల అప్పుచేసి తెలంగాణపై భారం మోపింది ఎవరో యువత ఆలోచిస్తున్నారు. అమ్మ పులి వచ్చే కథలా కేసీఆర్ మాటలు ఉన్నాయి. బీఆర్ఎస్ హయంలో ధరణి తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేశారో, ఎంత మంది ప్రజల పొట్టకొట్టారో అందరికీ తెలుసు. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. కేసీఆర్ లాగే అందరూ ఉంటారు అనుకోవడం కేసీఆర్ భ్రమ అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

ALSO READ Ponnam Prabhakar | తోలు తీసే హక్కు మీకు లేదు.. ప్రజలకు మాత్రమే ఉంది
Advertisement

తాజావార్తలు

Advertisement