Drugs | బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్వేర్
Drugs | హైదరాబాద్ నగరంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు పేపర్లకే పరిమితం అవుతున్నాయి. డ్రగ్స్ కట్టడికి క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
Drugs | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు పేపర్లకే పరిమితం అవుతున్నాయి. డ్రగ్స్ కట్టడికి క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడంటే అక్కడ.. నగరంలో డ్రగ్స్ దర్శనమిస్తున్నాయి.
తాజాగా ఓ లేడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆమె చిక్కడపల్లి కేంద్రంగా డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు తేలింది. ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కంపెనీలో పని చేస్తున్న ఆమె.. గత కొద్ది రోజుల నుంచి తన ప్రియుడితో కలిసి డ్రగ్స్ దందాకు తెరలేపింది.
డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో పాటు మరో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బాటిల్స్, ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ. 4 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026

Fab City Land Scam | ఫ్యాబ్ సిటీ భూ స్కాంపై.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టుకు హ్యాట్సాఫ్
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



