త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ

Lake Development | సామాజిక బాధ్యత కింద నగరంలోని చెరువులను అభివృద్ధి (Lake Development) చేద్దామని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి సంస్థ (MAUD) హైద‌రాబాద్ నగరంలోని పలు సంస్థలకు పిలుపునిచ్చింది.

G

Hyderabad | Published On Aug 12, 2026, 8.09 am IST

Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ
Advertisement

Lake Development | త్రినేత్ర‌.న్యూస్‌: సామాజిక బాధ్యత కింద నగరంలోని చెరువులను అభివృద్ధి (Lake Development) చేద్దామని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి సంస్థ (MAUD) హైద‌రాబాద్ నగరంలోని పలు సంస్థలకు పిలుపునిచ్చింది. చెరువుల అభివృద్ధి, పునరుజ్జీవనంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) భాగస్వామ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో పుర‌పాల‌క శాఖ, స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎస్ఆర్ రౌండ్ టేబుల్ 2.0 కార్యక్రమంలో ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జయేశ్‌ రంజన్ (Jayesh Ranjan), హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (Ranganath) మాట్లాడారు. నగరంలోని చిన్న చెరువులను CSR నిధుల ద్వారా అభివృద్ధి చేసేందుకు కార్పొరేట్ సంస్థలను ముందుకు రావాలని ఆహ్వానించారు.

నగర పర్యావరణ సమతుల్యత, భవిష్యత్ నీటి అవసరాలు, వరదల నియంత్రణలో చెరువుల ప్రాధాన్యతను వివరించారు. హైడ్రా (HYDRAA) చేపట్టిన మొదటి దశ, రెండో దశ చెరువుల అభివృద్ధి పనులను రంగ‌నాథ్ పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించారు. అలాగే మూడో దశలో చేపట్టనున్న చెరువుల అభివృద్ధి కార్యక్రమానికి కూడా ప్రభుత్వ ఆమోదం లభించినట్లు తెలిపారు. నగరంలోని చెరువులను మరింత అభివృద్ధి చేసి, వాటిని భవిష్యత్ తరాలకు సంరక్షించేందుకు ప్రభుత్వ సంస్థలతో పాటు కార్పొరేట్ సంస్థలు, ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సీఎస్ఆర్‌ ద్వారా చిన్న చెరువుల అభివృద్ధికి సంస్థలు ముందుకు వస్తే నగర పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర హైదరాబాద్ (Sustainable Hyderabad) నిర్మాణానికి మరింత తోడ్పాటు అందుతుందని తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement