Hyderabad | ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు.. పెండ్లయిన వ్యక్తి మాస్టర్ ప్లాన్..
Hyderabad | త్రినేత్ర.న్యూస్: అతను ఓ పబ్‌లో పర్చేజ్ మేనేజర్. పనిచేస్తున్న చోట ఓ యువతిపై మనసుపడ్డాడు. గత కొంత కాలంగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. అయితే అప్పటికే అతనికి పెండ్లి అయింది. ప్రేయసితో రెండు రోజులు ప్రత్యేకంగా గడపాలనుకున్నాడు. దీంతో ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. తనను ఎవరో కిడ్నాప్ చేసినట్లు డ్రామా ఆడాడు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ బయటపడింది..
రావూరి పూర్ణచందర్ (34) అనే వ్యక్తి హైదరాబాద్ (Hyderabad) మాదాపూర్‌లోని ఓ పబ్‌లో పర్చేజ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రామంతాపూర్ డివిజన్‌లోని గాంధీనగర్ జనప్రియ అపార్టుమెంటులో ఉంటున్నారు. అతనికి భార్య, తొమ్మిదేండ్ల కూతురు ఉన్నది. గురువారం రాత్రి స్నేహితులు వచ్చారని చెప్పి తన ఫోన్‌ను ఇంట్లోనే ఉంచి డోర్‌బయట బేడం పెట్టి వెళ్లాడు. అపార్ట్‌మెంట్ నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చి ఇద్దరు అమ్మాయిలు, మరో వ్యక్తితో కలిసి వెళ్లిపోయారు. ఉదయం నిద్ర లేచిన భార్య.. భర్త కనిపించకపోవడంతో అతనికి ఫోన్ చేసింది. రెండు రోజులుగా స్విచ్చాఫ్ వస్తుండటంతో ఆందోళనకు గురైంది. అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు అతడిని తీసుకెళ్తున్నట్లు గమనించింది. దీంతో తన భర్తను కిడ్నాప్ చేశారని ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త ఆచూకీ కనుక్కోవాలని వారిని వేడుకుంది. అతను పనిచేసే పబ్‌కు వెళ్లి తన భర్తను కిడ్నాప్ చేశారని చెప్పింది. దీంతో పబ్ నిర్వాహకులు కూడా మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆర్ధరాత్రి వచ్చిన యువతుల్లో ఒకరిని గుర్తించారు. ఆమెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా బెంగాలీ యువతితో సహజీవనం చేస్తున్నాడని తెలిసింది. వారి ఫోన్ నంబర్ లోకేషన్‌ను పరిశీలించగా ఒడిశాలో ఉన్నట్లు తెలిసింది. దీంతో ప్రియురాలితే గడిపేందుకు పబ్‌లో పనిచేసే యువతులతో కలిసి కిడ్నామ్ డ్రామా ఆడాడని గుర్తించారు.
సంబంధిత వార్తలు

Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు
జులై 17, 2026

MLC Shambhipur Raju | యువ సంగ్రామ సభకు ఎందుకు అనుమతివ్వరు.. ఎన్ని అడ్డంకులున్నా సక్సెస్ చేస్తం
జులై 17, 2026

CI Transfers | సైబరాబాద్ కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు.. ఉత్తర్వలు జారీ చేసిన సీపీ
జులై 17, 2026
తాజావార్తలు
- ●Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు
- ●Employees Health Scheme | 'ఈహెచ్ఎస్' పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్
- ●Women's Hockey WC | మహిళల హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా సలీమా టెటే
- ●CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..
- ●FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ తొలిసారి విజేతలకు చాంపియన్‌షిప్ రింగ్స్..! అభిమానులకు కూడా..!
- ●TECNO CAMON 50 Ultra 5G | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నికతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

Madhya Pradesh High Court | అందరికీ తెలిసేలా.. రిలేషన్ షిప్లో ఉన్నారు.. రేప్ కేసు కుదరదు

Employees Health Scheme | 'ఈహెచ్ఎస్' పథకం ప్రారంభం.. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్

Women's Hockey WC | మహిళల హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా సలీమా టెటే

CBDT | విదేశీ ఆస్తుల వివరాలు ఇక ఏఐఎస్‌లో.. ఐటీఆర్ ఫైలింగ్‌కు సీబీడీటీ కొత్త సౌకర్యం..



