HYDRAA | హైదరాబాద్‌లో చెరువుల అభివృద్ధి భేష్.. హైడ్రా పనితీరుపై బీహార్ సిటీ మేనేజర్లు ప్రశంసలు
HYDRAA | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో హైడ్రా చెరువులను అభివృద్ధి చేయడాన్ని బీహార్ సిటీ మేనేజర్లు ప్రశంసించారు. చెరువుల ఆక్రమణలు తొలగించడం.. వాటిని పునరుద్ధరించడం సామాన్యమైన విషయం కాదని వారు పేర్కొన్నారు.
HYDRAA | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో హైడ్రా చెరువులను అభివృద్ధి చేయడాన్ని బీహార్ సిటీ మేనేజర్లు ప్రశంసించారు. చెరువుల ఆక్రమణలు తొలగించడం.. వాటిని పునరుద్ధరించడం సామాన్యమైన విషయం కాదని వారు పేర్కొన్నారు.
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజింగ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో భాగంగా బిహార్ నుంచి వచ్చిన సిటీ మేనేజర్ల (IAS అధికారులు) బృందం నగరాన్ని సందర్శించింది. హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో శుక్రవారం పరిశీలించింది. కూకట్‌పల్లిలోని నల్ల చెరువు అక్రమణల తొలగింపు నుంచి చెరువు పునరుద్ధరణ ప్రస్తుత పరిస్థితి వరకూ చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్స్ డైరెక్టర్ యూనస్ వివరించారు.

చెరువు అభివృద్ధితో వరద ముప్పు తప్పింది
చుట్టూ వేల సంఖ్యలో నివాస ప్రాంతాలున్నాయి. మొత్తం కాంక్రీట్ జంగిల్‌గా ఉన్న ప్రాంతంలో వర్షం నీటికి నల్లచెరువు మార్గం చూపిందని హైడ్రా అధికారులు వివరించారు. చెరువుకు ఇన్లెట్లు, ఔట్లెట్లు అభివృద్ధి చేయడంతో వరద ముప్పు ఈ ప్రాంతానికి తొలగిందన్నారు. గత ఏడాదితో పోల్చితే భూగర్భ జలాలు కూడా బాగా పెరిగాయని స్థానికులు ఈ సందర్భంగా ఐఏఎస్‌ల బృందానికి వివరించారు. చెరువు చుట్టూ ప్రయాణించి బండ్ నిర్మాణంతో పాటు అక్కడ పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన ప్లే ఏరియాను తిలకించారు. సరస్సు పునరుజ్జీవన పనులు చేపట్టక ముందు ఉన్న పరిస్థితులు, అనంతరం చేపట్టిన చర్యలు, సరస్సు పరిధి పరిరక్షణ, పరిసరాల అభివృద్ధి, ఆక్రమణల నియంత్రణ, నీటి వనరుల రక్షణ తదితర అంశాలపై హైడ్రా అధికారులు సిటీ మేనేజర్లకు వివరించారు.హైడ్రా చేపడుతున్న సరస్సుల పరిరక్షణ, పునరుజ్జీవన చర్యలను సిటీ మేనేజర్లు అభినందించారు. క్షేత్రస్థాయిలో సరస్సు చుట్టూ పర్యటించడం ద్వారా పట్టణ నీటి వనరుల పరిరక్షణలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలపై తమకు ప్రత్యక్ష అవగాహన కలిగిందని తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



