త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uppal Stadium | 14న ఉప్ప‌ల్ స్టేడియంల్ క్రికెట్ మ్యాచ్.. ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు

Uppal Stadium | ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియం( Uppal Stadium )లో ఈ నెల 14న సాయంత్రం భార‌త్ - వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య 4వ టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో క్రికెట్ మ్యాచ్‌కు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ట్లు మ‌ల్కాజ్‌గిరి సీపీ సుమ‌తి( CP Sumathi ) వెల్ల‌డించారు.

S

Hyderabad | Published On Oct 13, 2026, 7.21 am IST

Uppal Stadium | 14న ఉప్ప‌ల్ స్టేడియంల్ క్రికెట్ మ్యాచ్.. ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు
Advertisement

Uppal Stadium | త్రినేత్ర న్యూస్ : ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియం( Uppal Stadium )లో ఈ నెల 14న సాయంత్రం భార‌త్ - వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య 4వ టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో క్రికెట్ మ్యాచ్‌కు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ట్లు మ‌ల్కాజ్‌గిరి సీపీ సుమ‌తి( CP Sumathi ) వెల్ల‌డించారు. స్టేడియం లోప‌ల‌, బ‌య‌ట 2200 మంది పోలీసులతో భ‌ద్ర‌త ఏర్పాటు చేసిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. పోకిరీల ప‌ని ప‌ట్టేందుకు ఐదు షీ టీమ్స్ కూడా రంగంలోకి దింపిన‌ట్లు తెలిపారు. 408 సీసీ కెమెరాలతోనూ, తొలిసారిగా రెండు డ్రోన్లతో అడుగడుగునా నిఘా ఉంటుందన్నారు.

ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు

బుధ‌వారం సాయంత్రం మ్యాచ్ నేప‌థ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కూడా ప్ర‌త్యేక బ‌స్సులు న‌డుపుతున్న‌ట్లు తెలిపింది. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్ప‌ల్ స్టేడియంకు 60 ప్ర‌త్యేక బ‌స్సులు అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొంది. ఈ ప్ర‌త్యేక బ‌స్సులు సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు క్రికెట్ ల‌వ‌ర్స్‌కు అందుబాటులో ఉంటాయి. ప్ర‌త్యేక ఆర్టీసీ బ‌స్సుల కోసం 99592 26160 నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

Advertisement
Advertisement