త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medical College | ఎల్‌బీన‌గ‌ర్‌కు మెడికల్ కాలేజీ.. వ‌చ్చే ఏడాది నుంచి అందుబాటులోకి..

Medical College | హైద‌రాబాద్‌లోని ఎల్‌బీ న‌గ‌ర్‌లో మెడిక‌ల్ కాలేజీ (Medical College) ఏర్పాటు కానుంది. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చైతన్య‌పురిలో టిమ్స్ హాస్పిట‌ల్ (TIMS Hospital) నిర్మిత‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. దానికి అనుబంధంగా వ‌చ్చే ఏడాది నుంచి మెడిక‌ల్ క‌ళాశాల వ‌చ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది.

G

Hyderabad | Published On Mar 29, 2026, 6.29 am IST

Medical College | ఎల్‌బీన‌గ‌ర్‌కు మెడికల్ కాలేజీ.. వ‌చ్చే ఏడాది నుంచి అందుబాటులోకి..
Advertisement

Medical College | త్రినేత్ర‌.న్యూస్: హైద‌రాబాద్‌లోని ఎల్‌బీ న‌గ‌ర్‌లో మెడిక‌ల్ కాలేజీ (Medical College) ఏర్పాటు కానుంది. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చైతన్య‌పురిలో టిమ్స్ హాస్పిట‌ల్ (TIMS Hospital) నిర్మిత‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. దానికి అనుబంధంగా వ‌చ్చే ఏడాది నుంచి మెడిక‌ల్ క‌ళాశాల వ‌చ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్ప‌టివ‌ర‌కు వనస్థలిపురం ప్రాంతీయ ద‌వాఖాన‌కు అనుబంధంగా కొనసాగుతున్న మహేశ్వరం మెడికల్‌ కళాశాలను ఇక నుంచి ఎల్‌బీనగర్‌కు పరిమితం అవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రకటించారు. మహేశ్వరం నియోజకవర్గానికి మరో కాలేజీని పరిశీలిస్తామన్నారు.

కాగా, మహేశ్వరం మెడికల్ కాలేజీ ప్రారంభమై రెండేండ్లు అయిపోయింది. ప్ర‌స్తుతం అక్క‌డ‌ వంద మంది విద్యార్థులున్నారు. 130 మంది క్లినికల్‌ సిబ్బంది, 50 మంది ప్రొఫెసర్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పాటు కానున్న‌ కాలేజీ కోసం ఎల్బీనగర్‌ ప్రాంతంలోని వనస్థలిపురం, హస్తినాపురం, మన్సూరాబాద్‌ ప్రాంతాల్లో అధికారులు అద్దె భవనాలను వెతుకుతున్నారు.

ఇక వనస్థలిపురం హాస్పిట‌ల్‌ను బ్రాడ్‌ సూపర్‌ స్పెషాలిటీ ద‌వాఖాన‌గా అప్‌గ్రేడ్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ 100 పడకలుండ‌గా, రోజూ సుమారుగా 1200 మంది ఓపీ వస్తోంది. వందకుపైగానే ఐపీ ఉంటున్న‌ది. మొత్తం 70 మంది వైద్యులుండ‌గా, 24 గంటలు పాటు 10 మంది వైద్యులు సేవ‌లు అందిస్తున్నారు. హాస్పిట‌ల్‌లో సొంతంగా రక్త, మూత్ర పరీక్షల కేంద్రం ఉంది. త్వరలో సిటీ స్కాన్‌ సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement