త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Liver Transplantation | ఉస్మానియాలో 18 నెల‌ల చిన్నారికి విజ‌య‌వంతంగా లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌..

Liver Transplantation | ఉస్మానియా ద‌వాఖాన‌లో (Osmania Hospital) అరుదైన లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ (Liver Transplantation) విజ‌య‌వంతంగా చేశారు. 18 నెల‌ల చిన్నారి గ్లైకోజెన్ స్టోరేజ్ వ్యాధితో (Glycogen Storage Disease) బాధ‌ప‌డుతున్నాడు.

G

Hyderabad | Published On Apr 30, 2026, 1.18 pm IST

Liver Transplantation | ఉస్మానియాలో 18 నెల‌ల చిన్నారికి విజ‌య‌వంతంగా లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌..
Advertisement

Liver Transplantation | త్రినేత్ర‌.న్యూస్‌: ఉస్మానియా ద‌వాఖాన‌లో (Osmania Hospital) అరుదైన లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ (Liver Transplantation) విజ‌య‌వంతంగా చేశారు. 18 నెల‌ల చిన్నారి గ్లైకోజెన్ స్టోరేజ్ వ్యాధితో (Glycogen Storage Disease) బాధ‌ప‌డుతున్నాడు. దీంతో తండ్రి కాలేయం నుంచి కొంత భాగాన్ని సేక‌రించిన ఉస్మానియా వైద్యులు.. దానిని చిన్నారికి అమ‌ర్చారు. ఈ క్లిష్ట‌మైన శ‌స్త్ర‌చికిత్స 14 గంట‌ల పాటు కొన‌సాగింది.

ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కింద పూర్తిగా ఉచింతంగానే చికిత్సం అందించామ‌ని వైద్యులు తెలిపారు. శ‌స్త్ర‌చికిత్స అనంత‌రం చిన్నారి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని చెప్పారు. దేశంలో ప్ర‌భుత్వం రంగంలో ఇలాంటి స‌ర్జ‌రీలు అత్యంత అరుదుగా జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించారు. చిన్నారికి విజ‌య‌వంతంగా లివ‌ర్ మార్పిడీ చేసిన ఉస్మానియ డాక్ట‌ర్ల బృందాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ అభినందించారు.

 

Advertisement
Advertisement