Hyderabad | కారుతో ఢీకొట్టిన ఘటనలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి..
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) మాసబ్‌ట్యాంక్‌లో ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టిన ఘటనలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతిచెందారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) మాసబ్‌ట్యాంక్‌లో ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టిన ఘటనలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతిచెందారు. శనివారం ఉదయం మాసబ్ ట్యాంక్‌లోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన మొయినుద్దీన్‌ను.. పథకం ప్రకారం అప్పటికే అక్కడ వేచిఉన్న దుండగులు ఆయనను కారుతో ఢీకొట్టారు. దీంతో ఆయన గాల్లోకి ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన దవాఖానకు తరలించారు.
అయితే చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన కబ్జాకు గురవుతున్న వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ ను కారుతో ఢీ కొట్టిన ప్రత్యర్థులు
ఇంటి నుండి బయటకు రాగానే కారుతో ఢీ కొట్టిన ప్రత్యర్థులు
ఆసుపత్రికి తరలింపు.. మొయినుద్దీన్ పరిస్థితి విషమం
సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు pic.twitter.com/KcD9ztyd6R
— BIG TV Breaking News (@bigtvtelugu) May 23, 2026
తాజావార్తలు
- ●Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత
- ●Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..
- ●Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు
- ●POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష
- ●Central Railway Stations | ప్రయాణికులకు అలర్ట్.. పెరగనున్న ఇడ్లీ, దోశ, సమోస, వడ పావ్ ధరలు
- ●Balka Suman | నాపై మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో : బాల్క సుమన్

Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత

Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..

Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు

POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష





