KTR | ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఈ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోంది : కేటీఆర్
KTR | ఇండస్ట్రియల్ బాధిత రైతులను కలిసేందుకు పరిగి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao), సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్, ఇతర నేతల (BRS) అరెస్టులు, నిర్బంధాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | ఇండస్ట్రియల్ బాధిత రైతులను కలిసేందుకు పరిగి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao), సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్, ఇతర నేతల (BRS) అరెస్టులు, నిర్బంధాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమిని కాపాడుకునేందుకు పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న నేతలను అక్రమంగా నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కేటీఆర్ మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలోని కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి 1,200 ఎకరాల భూమిని బలంతంగా లాక్కున్నారని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి పేదల భూములపైన పడిందని మండిపడ్డారు. రైతు భరోసా, రుణమాఫీ, ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు పరిశ్రమల పేరుతో భూ సేకరణకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు.
గత రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాని ఈ సర్కార్.. భూములను దోచుకోవడంలో మాత్రం విపరీతమైన ఆసక్తి చూపుతోందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు దొంగల్లా ఊళ్లు పంచుకుంటున్నట్లు భూములను కబ్జా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్తేమీ కాదని, ఉద్యమ కాలం నుంచే వీటన్నింటినీ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డమాని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదన్నారు. ప్రజల పక్షాన పోరాటం ఆగదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంత అణచివేతకు పాల్పడినా.. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్రమంగా నిర్బంధించిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, భూ సేకరణను తక్షణమే నిలిపివేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read..
హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పరిగి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



