త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం..

Telangana | ఎండ, ఉక్త‌పోత‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు అందించింది. రాష్ట్రంలో (Telangana) మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

G

Telangana | Published On Apr 7, 2026, 8.06 am IST

Telangana | నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం..
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్‌: ఎండ, ఉక్త‌పోత‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు అందించింది. రాష్ట్రంలో (Telangana) మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏప్రిల్ 7,8,9వ తేదీల్లో వర్షాలు కురుస్తాయ‌ని అంచ‌నావేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవ‌కాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.

మంగ‌ళ‌వారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్ల‌గొండ, మహబూబాబాద్, వరంగల్, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గామ‌, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వానలు పడతాయని తెలిపింది. ఇక రానున్న మూడు రోజులు చిరు జల్లులు పడతాయని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరుగుతాయని హెచ్చరించింది.

Advertisement
Advertisement