త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | కేసీఆర్‌ను తిడితే కేటీఆర్‌కు కోపం రాదా..? : త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉధృతంగా మాట్లాడితే అహంకారం అంటున్నారు.. ఆయన తండ్రిని తిడితే ఆయనకి కోపం రాదా? అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌శ్నించారు. మీ అన్ననో, తండ్రినో తిడితే మీకు కోపం రాదా? అని నిల‌దీశారు.

S

Telangana | Published On May 16, 2026, 2.27 pm IST

Talasani Srinivas Yadav | కేసీఆర్‌ను తిడితే కేటీఆర్‌కు కోపం రాదా..? : త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్
Advertisement

Talasani Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉధృతంగా మాట్లాడితే అహంకారం అంటున్నారు.. ఆయన తండ్రిని తిడితే ఆయనకి కోపం రాదా? అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌శ్నించారు. మీ అన్ననో, తండ్రినో తిడితే మీకు కోపం రాదా? అని నిల‌దీశారు. అలాంటిది కేసీఆర్‌ను పట్టుకొని పేగులు మెడలో వేస్తా, తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటే.. ఒక కొడుకుగా ఆయన బాధ ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోవాలన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. మహిళలకు 2500 ఇస్తామని చెప్పి మోసం చేసింది. రైతు భరోసా పేరుతో మోసం చేసింది. ఇవే కాదు.. అనేక హామీలు ఇచ్చి అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ మోసం చేసింద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

కేటీఆర్ ఈ మధ్య కాలంలో మాట్లాడుతుంటే ఒకరు మంచి అంటున్నారు, మరికొందరు అహంకారం అంటున్నారు. కేసీఆర్ ను తిడితే కొడుక్కి కోపం రాదా, బాధ, ఆవేదన ఎలా ఉంటుందో గుర్తు పెట్టుకోకుండా , కేటీఆర్ పై ఇష్టం వచ్చినట్లు కొందరు మాట్లాడుతున్నారు. ప్రపంచ వేదికలపై కేటీఆర్ అద్భుతంగా మాట్లాడి, తెలంగాణకు పెట్టుబడులు తెచ్చారు. కాంగ్రెస్ పాలనలో అద్భుతాలు జరుగుతాయ‌ని ప్రజలు భావించారు, ఇప్పుడు చుక్కలు చూస్తున్నారని త‌ల‌సాని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ఓటు మనందరి హక్కు స‌ర్‌ ప్రక్రియతో ఓటు తీసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ కమిటీలు, డిజిటల్ మెంబర్‌షిప్ చేయాల‌ని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ మెంబర్‌షిప్‌తో కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరుచుకునేందుకు వీలుంటుంది. రెండేళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం. బీఆర్ఎస్ క‌న్నా చాంపియ‌న్‌షిప్ ఇంకెవ‌రూ లేరు. మెంబ‌ర్‌షిప్ పూర్తి కాగానే క‌మిటీలు ఏర్పాటు చేస్తాం. క‌మిటీల్లో స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం వారికి ప్రాధాన్య‌త ఉంటుంది. దేశంలో ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ పేరు, గులాబీ జెండా పేరు చెప్పితే గౌర‌విస్తారు. మరో రెండేళ్లు ఓపిక పడితే బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది అని త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ధీమా వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement