KP Vivekananda | కొంతమందికే మొక్కుబడిగా కొత్త పెన్షన్లు.. అర్హులైన చాలా మందికి మొండిచేయి
KP Vivekananda | కొత్తవారికి సామాజిక భద్రత ఫించన్లు (Pensions) ఇస్తామని దరఖాస్తులు తీసుకుని కేవలం కొంతమందికే మొక్కుబడిగా ఇస్తున్నారని ఎమ్మెల్యే, శాసనసభలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద (KP Vivekananda) ఆరోపించారు.
- రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతోంది
- మండిపడిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద
KP Vivekananda | త్రినేత్ర న్యూస్: కొత్తవారికి సామాజిక భద్రత ఫించన్లు (Pensions) ఇస్తామని దరఖాస్తులు తీసుకుని కేవలం కొంతమందికే మొక్కుబడిగా ఇస్తున్నారని ఎమ్మెల్యే, శాసనసభలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద (KP Vivekananda) ఆరోపించారు. అర్హులైన చాలామందికి ఫించన్లు దూరం చేశారని మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ (Quthbullapur) సామాజిక భద్రత ఫించన్ల పంపిణీ సభలో వివేకానంద మాట్లాడుతూ కొత్త వృద్ధాప్య ఫించన్ల సంగతి అసలు మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతోందని దుయ్యబట్టారు. మోసపూరిత కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీచేసేందుకు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి రాబోతోందని జోస్యం చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ పాలనపై తిరగబడుతున్నారని గుర్తు చేశారు. పాలన అవినీతి మయమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరని అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. అర్హులైన వారందరికీ ఫించన్లు వచ్చేలా బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
- ●BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం
- ●Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే
- ●Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..
- ●Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు
- ●HMWSSB | హైదరాబాద్ నీటి కష్టాలకు చెక్!

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ

BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం

Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే

Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..





