త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Detective Inspector | పెండ్లి పేరుతో లైంగిక దాడి.. ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామిపై కేసు నమోదు

Detective Inspector | పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై ఖైరతాబాద్‌ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (DI)పై సైదాబాద్ పీఎస్‌లో కేసు న‌మోదైంది.

G

Hyderabad | Published On Oct 11, 2026, 10.46 am IST

Detective Inspector  | పెండ్లి పేరుతో లైంగిక దాడి.. ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామిపై కేసు నమోదు
Advertisement

Detective Inspector | త్రినేత్ర న్యూస్‌: పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై ఖైరతాబాద్‌ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (DI)పై సైదాబాద్ పీఎస్‌లో కేసు న‌మోదైంది. ప్రేమ‌, పెండ్లి పేరుతో త‌న‌ను మోసం (Exploited) చేశాడ‌ని డీఐ బాల‌స్వామిపై మ‌హిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయ‌న‌పై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదుచేశారు.

2016లో పీఎస్‌కు వెళ్లిన త‌న‌తో డీఐ బాల‌స్వామి ప‌రిచ‌యం పెంచుకున్నాడ‌ని, 2017 నుంచి త‌న‌తో క‌లిసి ఉంటున్నాడ‌ని ఫిర్యాదులో పేర్కొంది. త‌న‌ను ప్రేమించాన‌ని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తున్నాడని తెలిపింది. తన భర్త మరణించిన తర్వాత కూడా, పెళ్లి చేసుకుంటాననే నమ్మకంతో అతను తనతో శారీరక సంబంధాన్ని కొనసాగించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ క్ర‌మంలో ఇటీవల పెండ్లి విష‌య‌మై బాల‌స్వామిని నిలదీయ‌డంతో అతడు నిరాకరించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో సైదాబాద్ (Saidabad) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement