Abhijeet Dipke | రేపిస్టులను అరెస్ట్ చేయకుండా.. ప్రభుత్వం అభిజీత్‌ను ఎందుకు నిర్బంధిస్తోంది?: దిప్కే తల్లి అనిత
Abhijeet Dipke | కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను (Abhijeet Dipke) నిర్బంధించడంపై ఆయన తల్లి అనిత దిప్కే (Anita Dipke) ఆగ్రహం వ్యక్తం చేశారు. నానమ్మ మరణం గురించి దీప్కేకు తెలిసి ఉంటే, అతను ఇప్పటికే వచ్చేవాడని చెప్పారు.
Abhijeet Dipke | త్రినేత్ర న్యూస్: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను (Abhijeet Dipke) నిర్బంధించడంపై ఆయన తల్లి అనిత దిప్కే (Anita Dipke) ఆగ్రహం వ్యక్తం చేశారు. నానమ్మ మరణం గురించి దీప్కేకు తెలిసి ఉంటే, అతను ఇప్పటికే వచ్చేవాడని చెప్పారు. దిప్కేను సంప్రదించలేకపోతున్నామని, అతడు ఎక్కడ ఉన్నాడో తమకు ఇప్పటికీ తెలియదన్నారు. ఢిల్లీ పోలీసులు (Delhi Police) అబద్ధం చెబుతున్నారని విమర్శించారు. అతని రాకకోసమే తాము అంత్యక్రియలను వాయిదా వేశామని ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులను అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం అభిజీత్‌ను ఎందుకు నిర్బంధిస్తోందని (detain) ప్రశ్నించారు. అతడిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఏకంగా విమానంలోకి వెళ్లారు. ఇది ఎలాంటి పాలన? అని నిలదీశారు. శనివారం ఉదయం అభిజిత్‌తోపాటు సీజేపీ కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను పోలీసులు విమానంలోనే నిర్బంధించారు. అక్కడి నుంచి అజ్ఞాత ప్రాంతానికి తరలించారు.
కాగా, దిప్కే నానమ్మ సావిత్రి బాయి (85) మృతిచెందిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మహారాష్ట్రలోని హింగోలి జిల్లా, సంతుక్ పింప్రిలోని స్వగృహంలో శనివారం మరణించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సంతుక్ పింప్రిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే ఢిల్లీ పోలీసుల నిర్బంధంలో ఉన్న అభిజిత్‌కు సావిత్రి బాయి మరణ వార్తను తెలియజేశామని, కస్టడీలో ఉంటూనే తన నిరసన పోరాటాన్ని కొనసాగించాలా లేక నానమ్మ కడసారి చూపు కోసం సొంతూరుకు వెళ్లాలా అనే నిర్ణయాన్ని అతనికే వదిలేసినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ అభిజిత్‌ను సంప్రదించలేకపోయాయని ఆయన తల్లి అనిత చెప్పడం గమనార్హం. నానమ్మ మృతి గురించి తెలిసి ఉంటే అతడే ఇప్పటికే వచ్చేవాడని, పోలీసులు అబద్ధం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అభిజీత్ దిప్కే, అశుతోశ్ రంకా, సౌరవ్ దాస్‌లను ఆదివారం కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
#WATCH | Hingoli, Maharashtra: Abhijeet Dipke's mother, Anita Dipke, says, "We have not been able to contact him...Delhi Police is lying. If he got the news (his grandmother's demise), he would have come immediately...we have put the last rites on hold for him..." https://t.co/ncCp7cWxGF
— ANI (@ANI) October 11, 2026
సంబంధిత వార్తలు

Chalo Jantar Mantar | వెనక్కి తగ్గేదే లే!.. మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. ఢిల్లీలో కొనసాగుతున్న ఆంక్షలు
అక్టోబర్ 11, 2026

Delhi CJP Protest | ఢిల్లీని కుదిపేసిన సీజేపీ నిరసన.. దేశ రాజధానిలో అసలేం జరిగింది?
అక్టోబర్ 10, 2026

Abhijeet Dipke | నిరసనల వేళ.. అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం
అక్టోబర్ 10, 2026
తాజావార్తలు
- ●Road Accident | భర్త కళ్లెదుటే.. రోడ్డు ప్రమాదంలో నవ వధువు దుర్మరణం
- ●Secunderabad | బొల్లారంలో కిడ్నాప్‌నకు గురైన చిన్నారి హత్య.. సెక్యూరిటీ గార్డుపై అనుమానం
- ●Sharan Navaratri | శైలపుత్రి.. శక్తి స్వరూపిణి..! పర్వత పుత్రికగా అమ్మవారి తొలి దర్శనం..!
- ●Chalo Jantar Mantar | వెనక్కి తగ్గేదే లే!.. మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. ఢిల్లీలో కొనసాగుతున్న ఆంక్షలు
- ●Riyadh Airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై క్షిపణి దాడి.. పైలట్ సహా 12 మంది మృతి
- ●Medical Staff | ఖమ్మం DMHOలో 99 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక

Road Accident | భర్త కళ్లెదుటే.. రోడ్డు ప్రమాదంలో నవ వధువు దుర్మరణం

Secunderabad | బొల్లారంలో కిడ్నాప్‌నకు గురైన చిన్నారి హత్య.. సెక్యూరిటీ గార్డుపై అనుమానం

Sharan Navaratri | శైలపుత్రి.. శక్తి స్వరూపిణి..! పర్వత పుత్రికగా అమ్మవారి తొలి దర్శనం..!

Chalo Jantar Mantar | వెనక్కి తగ్గేదే లే!.. మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. ఢిల్లీలో కొనసాగుతున్న ఆంక్షలు



