త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Danam Nagender | న‌న్ను బీఆర్ఎస్ పార్టీ స‌స్పెండ్ చేయ‌లేదు.. దానం నాగేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌

Danam Nagender | న‌న్ను బీఆర్ఎస్ పార్టీ స‌స్పెండ్ చేయ‌లేదు అని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ పార్టీ యాక్ష‌న్‌ను బ‌ట్టి నా రియాక్ష‌న్ ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

S

Hyderabad | Published On Jan 29, 2026, 11.31 am IST

Danam Nagender | న‌న్ను బీఆర్ఎస్ పార్టీ స‌స్పెండ్ చేయ‌లేదు.. దానం నాగేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌
Advertisement

Danam Nagender | త్రినేత్ర‌.న్యూస్ : న‌న్ను బీఆర్ఎస్ పార్టీ స‌స్పెండ్ చేయ‌లేదు అని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ పార్టీ యాక్ష‌న్‌ను బ‌ట్టి నా రియాక్ష‌న్ ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే దానం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అన‌ర్హ‌త పిటిష‌న్‌పై విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా ఇలా స‌మాధానం ఇచ్చారు.

స్పీక‌ర్ నోటీసుల‌కు మా అడ్వ‌కేట్ ద్వారా రిప్లై పంప‌డం జ‌రిగింది. మ‌ళ్లీ స్పీక‌ర్ నుంచి నాకు ఎలాంటి పిలుపు రాలేదు. పిలుపు రాగానే నేను మా అడ్వ‌కేట్ వెళ్లి వివ‌ర‌ణ ఇస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు మేం జ‌వాబు ఇచ్చాం. మ‌మ్మ‌ల్ని విచార‌ణ‌కు ర‌మ్మ‌ని స్పీక‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేదు. క్రాస్ ఎగ్జామినేష‌న్‌కు పిటిష‌నర్ల‌ను పిలుస్తార‌ని అనుకుంటున్నాను. ఒక వేళ న‌న్ను పిలిస్తే త‌ప్ప‌కుండా వెళ్లి వివ‌ర‌ణ ఇచ్చుకుంటాను. ప్ర‌జాబ‌లంతో నేను గెలిచాను. ఎంఐఎం బ‌లంగా ఉన్న ఆసిఫ్‌న‌గ‌ర్‌లోనే ప్ర‌జాబ‌లంతో గెలుపొందాను. నేను ప్ర‌జ‌ల మ‌నిషిని. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేవాడిని. ప్ర‌జా బ‌ల‌మే నా బ‌లం. ఒక వేళ ఎన్నిక‌లు వ‌స్తే ప్ర‌జాక్షేత్రంలో నిల‌బ‌డి కొట్లాడుతాను అని దానం నాగేంద‌ర్ పేర్కొన్నారు.

మీరు ఏ పార్టీ అని విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా, దానం స‌మాధానం దాట‌వేసే ప్ర‌య‌త్నం చేశారు. నేను ఖైర‌తాబాద్ ఎమ్మెల్యేను అని చ‌మ‌త్క‌రించారు. ఇక న‌న్ను బీఆర్ఎస్ పార్టీ స‌స్పెండ్ చేయ‌లేదు. ఒక‌వేళ వారు న‌న్ను స‌స్పెండ్ చేసి ఉంటే.. దానికి వేరేలా స‌మాధానం చెప్పేవాడిని. వాళ్లు ఏ ర‌కంగా జ‌స్టిఫై చేసుకుంటారో దాన్ని బ‌ట్టి నా రిప్లై ఉంటుంది అని దానం నాగేంద‌ర్ అన్నారు.

తాను ఇప్ప‌టికీ బీఆర్ఎస్ పార్టీ స‌భ్యుడినే, తాను ఆ పార్టీకి రాజీనామా చేయ‌లేద‌ని దానం నాగేంద‌ర్ నిన్న స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌పై పార్టీ ఎలాంటి స‌స్పెన్ష‌న్, బ‌హిష్క‌ర‌ణ ఉత్త‌ర్వులు జారీ చేయ‌లేద‌ని పేర్కొన్నారు. త‌న‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖ‌లు చేసిన అన‌ర్హ‌త పిటిష‌న్ పూర్తిగా అస‌త్య ఆరోప‌ణ‌లే అని దానం తెలిపారు. ఊహాగానాలు, మీడియా క‌థ‌నాల‌పై ఆధార‌ప‌డి ఈ ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లుగా ఉంద‌ని దానం వ్యాఖ్యానించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement