త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | కుక్క మ‌ల‌విస‌ర్జ‌న‌.. ఐఎఫ్ఎస్‌పై ఐఆర్ఎస్ అధికారిణి ఫిర్యాదు

Hyderabad | కుక్క మ‌ల‌విస‌ర్జ‌న వివాదానికి దారి తీసింది. ఇద్ద‌రు సివిల్ స‌ర్వీసెస్ అధికారులు పోలీసు స్టేష‌న్ మెట్లెక్కాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 10లోని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీస‌ర్ల క్వార్ట‌ర్ల‌లో ఏప్రిల్ 13న చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

S

Hyderabad | Published On Apr 15, 2026, 4.43 pm IST

Hyderabad | కుక్క మ‌ల‌విస‌ర్జ‌న‌.. ఐఎఫ్ఎస్‌పై ఐఆర్ఎస్ అధికారిణి ఫిర్యాదు
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : కుక్క మ‌ల‌విస‌ర్జ‌న వివాదానికి దారి తీసింది. ఇద్ద‌రు సివిల్ స‌ర్వీసెస్ అధికారులు పోలీసు స్టేష‌న్ మెట్లెక్కాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 10లోని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీస‌ర్ల క్వార్ట‌ర్ల‌లో ఏప్రిల్ 13న చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఐఆర్ఎస్ అధికారిణి నితికా సింగ్.. త‌న పెంపుడు కుక్కను తీసుకొని బ‌య‌ట‌కు వెళ్లింది. కామ‌న్ ఏరియాలో ఆ కుక్క మ‌ల‌విస‌ర్జ‌న చేసింది. అక్క‌డే ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి సుతాన్.. కుక్క మ‌ల‌విస‌ర్జ‌న చేయ‌డాన్ని వ్య‌తిరేకించాడు. దీంతో ఇరువురి మ‌ధ్య స్వ‌ల్ప వివాదం చోటు చేసుకుంది.

అంత‌టితో ఆగ‌ని సుతాన్.. నితికా ఇంటికి వెళ్లి త‌లుపులు బాదాడు. అక్క‌డున్న పూలకుండీల‌ను ధ్వంసం చేశాడు. అస‌భ్య ప‌ద‌జాలంతో ఆమెను దూషించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఐఆర్ఎస్ ఆఫీస‌ర్ పేర్కొన్నారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఐఆర్ఎస్ అధికారిణి నితికా సింగ్ బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు స్పందించారు. నితికా సింగ్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఘ‌ట‌నాస్థ‌లిని ప‌రిశీలించిన పోలీసులు ఇరువురి స్టేట్‌మెంట్స్‌ను న‌మోదు చేశారు. విచార‌ణ జ‌రుపుతున్నారు. త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement