త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | ప‌ల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంట‌ర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

Hyderabad | హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లోని కోకాపేట్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బ‌ర్త్ డే పార్టీ అనంత‌రం ఓ 9 మంది మైన‌ర్లు క‌లిసి ఇన్నోవా క్రిస్టాలో ఔట‌ర్ రింగ్ రోడ్డుపై లాంగ్ డ్రైవ్‌కు బ‌య‌ల్దేరారు. నియో పోలీస్ వ‌ద్ద అదుపుత‌ప్పిన ఇన్నోవా ప‌ల్టీలు కొట్టింది.

S

Hyderabad | Published On Sep 13, 2026, 9.35 pm IST

Hyderabad | ప‌ల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంట‌ర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లోని కోకాపేట్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బ‌ర్త్ డే పార్టీ అనంత‌రం ఓ 9 మంది మైన‌ర్లు క‌లిసి ఇన్నోవా క్రిస్టాలో ఔట‌ర్ రింగ్ రోడ్డుపై లాంగ్ డ్రైవ్‌కు బ‌య‌ల్దేరారు. నియో పోలీస్ వ‌ద్ద అదుపుత‌ప్పిన ఇన్నోవా ప‌ల్టీలు కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇంట‌ర్ విద్యార్థి మ‌ద‌న్ మోహ‌న్ రెడ్డి స్పాట్‌లోనే ప్రాణాలు విడిచాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర గాయాల‌పాలైన మ‌రో 8 మంది విద్యార్థుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విద్యార్థులంతా హైటెక్ సిటీలోని తేజు కాలేజీలో ఇంట‌ర్ చ‌దువుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. తమన్ వర్మ అనే విద్యార్థి బర్త్‌డే పార్టీకి వెళ్లి లాంగ్ డ్రైవ్ కోసం ఔటర్ రింగ్ రోడ్డుపైకి వెళ్లిన సమయంలో ప్రమాదం జ‌రిగిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.

Advertisement
Advertisement