త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | హైద‌రాబాద్‌లో విధ్వంసానికి ఉగ్ర‌కుట్ర‌?.. చంచ‌ల్‌గూడ జైలులో ప్లాన్‌?

Hyderabad | హైద‌రాబాద్‌లో (Hyderabad) విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేసిన‌ట్లు నిఘా వ‌ర్గాలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ ఉగ్ర‌కుట్రకు చంచ‌ల్‌గూడ జైలు (Chanchalguda Jail) దీనికి వేదిక‌గా మారిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

G

Hyderabad | Published On Feb 21, 2026, 12.49 pm IST

Hyderabad | హైద‌రాబాద్‌లో విధ్వంసానికి ఉగ్ర‌కుట్ర‌?.. చంచ‌ల్‌గూడ జైలులో ప్లాన్‌?
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో (Hyderabad) విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేసిన‌ట్లు నిఘా వ‌ర్గాలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ ఉగ్ర‌కుట్రకు చంచ‌ల్‌గూడ జైలు (Chanchalguda Jail) దీనికి వేదిక‌గా మారిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జైలులో ములాఖత్‌కు వ‌చ్చిన వ్య‌క్తుల‌తో ఉగ్ర‌దాడుల గురించి మాట్లాడిన‌ట్లు తెలుస్తున్న‌ది. ల‌ష్క‌రే తొయిబాకు చెందిన ఉగ్ర‌వాది చంచ‌ల్‌గూడ జైలు నుంచి ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో ముసారంబాగ్‌, సైదాబాద్‌, మ‌లక్‌పేట ప్రాంతాల్లో పోలీసులు నిఘాపెట్టారు. ఇందులో భాగంగా వరుస పేలుళ్లకు కుట్ర చేశారన్న కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

Advertisement

తాజావార్తలు

Advertisement