త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Indlu Hyderabad | నగరంలో పేదలకు ‘ఇందిరమ్మ’ ఇళ్లు: రూ.6 లక్షలకే రూ.60 లక్షల ఫ్లాట్.. అప్లై చేసుకోండిలా!

హైదరాబాద్ నడిబొడ్డున పేదలకు సొంతింటి కలను నిజం చేస్తూ రేవంత్ సర్కార్ 'ఇందిరమ్మ టవర్స్' నిర్మిస్తోంది. రూ.6 లక్షలకే ఇల్లు సొంతం చేసుకునే ఛాన్స్. పూర్తి వివరాలివే!

J

Hyderabad | Published On Jul 23, 2026, 6.44 pm IST

Indiramma Indlu Hyderabad | నగరంలో పేదలకు ‘ఇందిరమ్మ’ ఇళ్లు: రూ.6 లక్షలకే రూ.60 లక్షల ఫ్లాట్.. అప్లై చేసుకోండిలా!
Advertisement
  • హైదరాబాద్‌లోని విలువైన ప్రభుత్వ భూముల్లో పేదల కోసం 'ఇందిరమ్మ టవర్స్' నిర్మాణం
  • రూ.40 నుంచి రూ.60 లక్షల విలువైన ఫ్లాట్లలో లబ్ధిదారుడి వాటా (Beneficiary Share) కేవలం రూ. 6 లక్షలు మాత్రమే
  • ఇండ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు
  • దరఖాస్తుల కోసం స్థానిక మీసేవ కేంద్రాలు, మీసేవ వాట్సాప్ నంబర్ (8096958096), లేదా వెబ్‌సైట్ (meeseva.telangana.gov.in) అందుబాటులో

Indiramma Indlu Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే నిరుపేదలకు తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ టవర్స్' (Indiramma Towers) ద్వారా నగరంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు గృహాలు నిర్మించి ఇవ్వనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. గురువారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ పథకంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

సిటీకి దూరంగా నెట్టేసిన బీఆర్ఎస్.. సిటీ సెంటర్‌లో కాంగ్రెస్ ఇళ్లు

గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల (Double Bedroom) పేరుతో పేదలను నగరానికి 30-40 కిలోమీటర్ల దూరంలోకి నెట్టివేశారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ఉపాధి, విద్య, వైద్యానికి దూరంగా పేదలను తరలించడం దారుణమన్నారు. కానీ, కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పారదర్శకంగా కోట్ల రూపాయల విలువైన స్థలాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తుంటే.. దొరలకు కడుపుమంటగా ఉందని విమర్శించారు. పేదోడికి సిటీ సెంటర్‌లో ఇల్లు ఉండటం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేకనే ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. పాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకే పేర్లు మార్చి అమ్ముతున్నారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు.

కేవలం రూ.6 లక్షలకే ఇల్లు (Scheme Benefits)

ఇందిరమ్మ టవర్స్ పథకం సామాన్యులకు ఒక సువర్ణావకాశం అని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఈ ఫ్లాట్ల మార్కెట్ విలువ రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు పలుకుతోంది. కానీ, ఈ పథకం కింద లబ్ధిదారులు కేవలం రూ. 6 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం రూ. 5 లక్షల సబ్సిడీని (Subsidy) కూడా అందిస్తోందని స్పష్టం చేశారు.

ఇళ్ల కేటాయింపులో 50 శాతం రిజర్వేషన్లు

ఇండ్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. క్యూర్ (CURE) పరిధిలో తొలి విడతగా ప్రయోగాత్మకంగా నిర్మించే ఈ ఇళ్లలో.. సగం ఫ్లాట్లను జనరల్ కేటగిరీకి, మిగిలిన 50 శాతాన్ని బడుగు బలహీన వర్గాలకు (Reservations) కేటాయించారు.

  • ఎస్సీలకు: 14%
  • బీసీలకు: 16%
  • ఎస్టీలకు, దివ్యాంగులకు: చెరో 5%
  • ఔట్ సోర్సింగ్, 4వ తరగతి, పారిశుధ్య కార్మికులకు: 10%

ముఖ్యంగా ఈ 50 శాతం రిజర్వేషన్లలో మళ్లీ 30 శాతం ఇళ్లను కేవలం మహిళలకే (Women Quota) దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఇందిరమ్మ ఇళ్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply)

ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన నిరుపేదలు సులభంగా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. కింది విధానాల ద్వారా అప్లై చేసుకోవచ్చు.

మీసేవ (MeeSeva): స్థానికంగా అందుబాటులో ఉండే మీసేవ కేంద్రాలకు వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

వాట్సప్ (WhatsApp): మీసేవ వాట్సప్ నంబర్ 8096958096 కు మెసేజ్ చేయడం ద్వారా కూడా ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ఆన్‌లైన్ (Online): దరఖాస్తుదారులు మీసేవ అధికారిక వెబ్‌సైట్ meeseva.telangana.gov.in ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు.

Advertisement
Advertisement