World QS Rankings | ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఐఐటీహెచ్
World QS Rankings | ఐఐటీ హైదరాబాద్ (IIT H) అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇంజినీరింగ్, టెక్నాలజీ యూని వర్సిటీల ర్యాంకింగ్స్‌లో (World QS Rankings) రికార్డు స్థాయి వృద్ధిని నమోదుచేస్తూ ప్రపంచంలోనే 395వ స్థానంలో నిలిచింది.
World QS Rankings | త్రినేత్ర.న్యూస్: ఐఐటీ హైదరాబాద్ (IIT H) అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇంజినీరింగ్, టెక్నాలజీ యూని వర్సిటీల ర్యాంకింగ్స్‌లో (World QS Rankings) రికార్డు స్థాయి వృద్ధిని నమోదుచేస్తూ ప్రపంచంలోనే 395వ స్థానంలో నిలిచింది. 2026 ఏడాదికి సంబంధించిన ర్యాంకింగ్స్‌ను క్యూఎస్ సంస్థ విడుదల చేసింది. 2025లో ఈ సంస్థ 501–550 ర్యాంకింగ్‌లో ఉండగా, ఒక్క ఏడాదిలోనే వందకుపైగా స్థానాలను మెరుగుపరచుకోవడం విశేషం. ఆరు ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రపంచంలోనే టాప్–300లో నిలిచింది. మొత్తం 9 సబ్జెక్టులు గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించా యి. మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్ట మ్స్, ఫిజిక్స్, ఆస్ట్రానమీ వంటి విభాగాలు మరింత వృద్ధిని సాధించాయి.

బ్రిటన్‌కు చెందిన క్వాక్వేరెల్లి సైమండ్స్ అనే సంస్థ ఈ క్యూఎస్ ర్యాంకింగ్‌లు (QS World University Rankings) ఇస్తుంది. ఆయా వర్సి టీల అకడమిక్స్, పరిశోధనలు, ఆవిష్కరణలు, ప్లేస్‌మెంట్స్, అంతర్జా తీయ సంబంధాలు వంటి అంశాల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు వేలకు పైగా విద్యాసంస్థలను విశ్లేషించిన క్యూఎస్ సంస్థ ఐఐటీహెచ్‌ను అత్యుత్తమ కేంద్రాలలో ఒకటిగా గుర్తించింది.
ఇక ఈ జాబితాలో టాప్ 50లో ఐఐటీ బాంబే 44వ స్థానంలో నిలువగా, ఐఐటీ ఢిల్లీ 45వ ర్యాంకు సాంధించింది. మెటీరియల్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ISM) ధన్‌బాద్ 21వ ర్యాంకు, బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, మార్కెటింగ్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ 21 ర్యాంకు సాధించింది.
విద్య, పరిశోధన నైపుణ్యాలకు ఐఐటీహెచ్ పెద్దపీట వేస్తుందనడానికి ఈ ర్యాంకులే నిదర్శనమని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి అన్నారు. అధ్యాపకులు, విద్యా ర్థులు కలి సి అకడమిక్స్, పరిశోధనలు, ఆవిష్కర ణలో చేసిన కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పారు.

హెచ్‌సీయూ కూడా..
హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ (HCU) కూడా అంతర్జాతీయంగా ఏడు సబ్జెక్టుల్లో మంచి గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా 1,700కు పైగా యూనివర్సిటీల్లో 55 అకడమిక్ విభాగాల్లో విద్యార్థులు తీసుకున్న 18,300కు పైగా వ్యక్తిగత ప్రోగ్రామ్‌ల పనితీరుపై క్యూఎస్ వరల్డ్ ర్యాంకులు ఇచ్చింది. ఇందులో హెచ్ సీయూ.. లింగ్విస్టిక్స్ (151–200), ఇంగ్లిష్ భాష– లిటరేచర్ (251–300), సోషియాలజీ (251–300), పొలిటికల్ సైన్స్ (301–400), కెమిస్ట్రీ (401–450), ఎకనామిక్స్–ఎకానోమెట్రిక్స్ (501– 550), బయో లాజికల్ సైన్సెస్ (651–700) సబ్జె క్టుల్లో మంచి ర్యాంకులు వచ్చాయి.
సంబంధిత వార్తలు

B.Optometry | హెచ్‌సీయూలో ‘ఆప్టోమెట్రీ’ డిగ్రీ కోర్సు.. ‘నీట్’ మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు
జులై 28, 2026

SSCTU | సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు
జులై 25, 2026

Kancha Gachibowli | హెచ్‌సీయూ భూముల్లో మళ్లీ బుల్డోజర్..? హైదరాబాద్ ఊపిరితిత్తులపై దాడి..!
జూన్ 12, 2026
తాజావార్తలు
- ●Dharmapuri Arvind | రేవంత్.. రూమ్‌లో రెండో వ్యక్తి లేకుండా ఎలక్షన్ ఫామ్ నింపు
- ●OnePlus | వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
- ●Mumbai Police | ముంబై పోలీసు శాఖలో భారీ స్కామ్.. ఘోస్ట్ ఉద్యోగులకు రూ.6.41 కోట్ల జీతాలు
- ●Konda Surekha | వరంగల్‌ను రెండో మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
- ●MLA Sudheer Reddy | 4 మీటర్ల లాంగ్ జంప్ ఎత్తేయండి
- ●TRAI | కాల్ క్వాలిటీపై ఇక ఫిర్యాదు చేయడం చాలా సులభం.. ట్రాయ్ కొత్త మైకాల్ యాప్ విడుదల..

Dharmapuri Arvind | రేవంత్.. రూమ్‌లో రెండో వ్యక్తి లేకుండా ఎలక్షన్ ఫామ్ నింపు

OnePlus | వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..

Mumbai Police | ముంబై పోలీసు శాఖలో భారీ స్కామ్.. ఘోస్ట్ ఉద్యోగులకు రూ.6.41 కోట్ల జీతాలు

Konda Surekha | వరంగల్‌ను రెండో మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం



