త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRAA | మైలార్‌దేవ్‌ప‌ల్లిలో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 188 ఎక‌రాల ప్లే గ్రౌండ్‌లో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు

HYDRAA | హైద‌రాబాద్ మైలార్‌దేవ్‌ప‌ల్లిలో (Mailardevpally) హైడ్రా భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. సుమారు రూ.100 కోట్ల విలువైన 6500 గజాల క్రీడమైదానాన్ని కాపాడింది.

G

Hyderabad | Published On Apr 1, 2026, 4.59 pm IST

HYDRAA | మైలార్‌దేవ్‌ప‌ల్లిలో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 188 ఎక‌రాల ప్లే గ్రౌండ్‌లో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు
Advertisement

HYDRAA | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ మైలార్‌దేవ్‌ప‌ల్లిలో (Mailardevpally) హైడ్రా భారీ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. సుమారు రూ.100 కోట్ల విలువైన 6500 గజాల క్రీడమైదానాన్ని కాపాడింది. మైలార్‌దేవ్‌పల్లి ప‌రిధిలోని శాస్త్రిపురం కాలనీలో 188 ఎకరాల హుడా లేఔట్‌లో ప్లే గ్రౌండ్ (Playground) కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRAA) తొలగించింది. జీ ప్లస్ 3 అంతస్తుల నిర్మాణ దశలో ఉన్న ఐదు భవనాలు, మరో రెండు సింగిల్ రూమ్ నిర్మాణాలను తొలగించింది. లేఔట్‌లో 6500 గజాల స్థలాన్ని ప్లే గ్రౌండ్ కోసం కేటాయించారు. అది క్రీడల కోసం కేటాయించిన స్థలం అని తెలిసిన‌ప్ప‌టికీ గత మూడేండ్లుగా నోటరీ మీద స్థానికంగా ఉన్న కబ్జాదారులు ప్లాట్లుగా చేసి అమ్మేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు.

ఇదే విష‌య‌మై జీహెచ్ఎంసీ (GHMC) గతంలో నోటీసులు కూడా ఇచ్చింది. 2024లో కూల్చివేస్తామంటూ నోటీసులు కూడా జారీ చేసింది. అయినా పట్టించుకోకుండా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈనేప‌థ్యంలో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో ప‌రిశీలించిన అధికారులు లేఔట్ ప్రకారం క్రీడాస్థలం కోసం కేటాయించార‌ని నిర్ధారించారు. దీంతో బుధ‌వారం ఉద‌యం ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 5 నిర్మాణంలో ఉన్న భావనలతో పాటు రెండు చిన్న గదులతో నిర్మించిన వాటిని తొలగించింది. మ‌రో రెండు భవనాల్లో ఇప్పటికే నివాసాలు ఉండడంతో వాటిని మినహాయించింది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement