త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

C-Mitra | ఇక ఇంటి నుంచే ఎఫ్ఐఆర్‌.. దేశంలో తొలిసారిగా ‘సీ-మిత్ర’ ప్రారంభించిన హైద‌రాబాద్ పోలీసులు..!

C-Mitra | ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ ఫ్రాడ్స్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సైబర్ నేర బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ‘సీ-మిత్ర’ (C-Mitra) పేరుతో విప్లవాత్మక వర్చువల్ హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించారు.

P

Hyderabad | Published On Jan 9, 2026, 7.28 pm IST

C-Mitra | ఇక ఇంటి నుంచే ఎఫ్ఐఆర్‌.. దేశంలో తొలిసారిగా ‘సీ-మిత్ర’ ప్రారంభించిన హైద‌రాబాద్ పోలీసులు..!
Advertisement

C-Mitra | ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ ఫ్రాడ్స్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సైబర్ నేర బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ‘సీ-మిత్ర’ (C-Mitra) పేరుతో విప్లవాత్మక వర్చువల్ హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించారు. దాంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు నుంచి ఎఫ్ఐఆర్ నమోదు వరకూ ప్రక్రియ పూర్తవుతుంది.

సాధారణంగా బాధితులు 1930 నంబర్‌కు లేదా జాతీయ సైబర్ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కోసం స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చేది. కానీ, సీ-మిత్రతో ఆ అవసరం లేదు. సీ-మిత్ర బృందమే బాధితులకు ఫోన్ చేసి వివరాలు సేకరిస్తుంది. ఏఐ సాంకేతికతతో ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను తయారు చేసి బాధితులకు పంపిస్తుంది. బాధితులు దాన్ని ప్రింట్ తీసుకుని సంతకం చేసి పోస్టు, కొరియర్ లేదా సైబర్ క్రైం పీఎస్‌లోని డ్రాప్‌బాక్స్ ద్వారా పంపాలి. ఈ సేవలు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న బాధితులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ప్ర‌స్తుతం లక్ష రూపాయలకు మించిన సైబర్ మోసాలను సైబర్ క్రైమ్ స్టేషన్‌లోనూ, అంతకంటే తక్కువైతే స్థానిక పోలీస్ స్టేషన్‌లోనూ నమోదు చేస్తున్నారు. అయితే, ఇకపై 'సి-మిత్ర' విధానం ద్వారా 3 ల‌క్షల లోపు ఉన్న కేసులను జీరో ఎఫ్ఐఆర్ చేసి, తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తారు. 3 ల‌క్ష‌లపైన ఉన్న ఫిర్యాదుల‌ను సైబ‌ర్ క్రైం పోలీస్ స్టేష‌న్‌లో కేసులు న‌మోదు చేయ‌డం జ‌రుగుతుంది.

సీ-మిత్ర సేవ‌లు పొందేందుకు బాధితులు 1930కి కాల్ గానీ, జాతీయ సైబర్ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే సి-మిత్ర బృందంలోని వర్చువల్ పోలీస్ ఆఫీసర్లు బాధితులకు కాల్ చేసి, వర్చువల్ పద్ధతిలో ఫిర్యాదు చేసే విధానాన్ని వివరిస్తారు. సిద్ధం చేసిన ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను బాధితులకు పంపిస్తారు. బాధితులు దాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి పోస్ట్, కొరియర్, డ్రాప్ బాక్స్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో డిజిటల్ సంతకం ఆప్షన్ కూడా పరిశీలనలో ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి, ఆ వివరాలను సందేశరూపంలో బాధితులకు పంపిస్తారు.

ఈ వర్చువల్ హెల్ప్‌డెస్క్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 24 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం, ఏఐ పరిజ్ఞానంతో బాధితులకు సేవలు అందిస్తుంది. సీ-మిత్ర అధికారిక ల్యాండ్‌లైన్ నంబర్ 040-4189-3111 నుంచి మాత్రమే కాల్స్ వస్తాయి. వాట్సాప్ ద్వారా సమాచారం కేవలం 87126 సిరీస్ నంబర్ల నుంచే వస్తుంది. సీ-మిత్ర పేరుతో వచ్చే నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సీ-మిత్ర సిబ్బంది ఎప్పుడూ ఓటీపీ గానీ, డబ్బులు గానీ అడగరు. సీ-మిత్ర కేసును దర్యాప్తు చేయదు.

పోయిన డబ్బును వెనక్కి ఇప్పిస్తామని హామీ ఇవ్వదు. చట్టపరమైన సలహాలు కూడా ఇవ్వదు. కేసు స్టేటస్ తెలుసుకోవాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్‌నే సంప్రదించాల‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో అడిషనల్ సీపీ శ్రీనివాసులు, డీసీపీ (సైబర్ క్రైమ్) అరవింద్ బాబు, ఏసీపీ (సైబర్ క్రైమ్) శివమారుతీ బృందాన్ని అభినందించారు. స‌హ‌కారం అందించిన అధికారులు కారె కిరణ్ ప్రభాకర్, కే అపూర్వ రావు, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, సీహెచ్ రూపేప్‌, బీ వెంక‌టేశ్వ‌ర్లుకు ప్ర‌శంసించారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement