త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drunk and Drive in Hyderabad | హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్: రెండు రోజుల్లోనే 445 మంది మందుబాబుల పట్టివేత!

హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ 'డ్రంక్ అండ్ డ్రైవ్' తనిఖీల్లో 445 మంది మందుబాబులు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

J

Hyderabad | Published On Mar 8, 2026, 9.35 pm IST

Drunk and Drive in Hyderabad | హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్: రెండు రోజుల్లోనే 445 మంది మందుబాబుల పట్టివేత!
Advertisement

Drunk and Drive in Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ మహా నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచే దిశగా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రధానంగా మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 6, 7 తేదీల్లో (రెండు రోజుల పాటు) మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.

Drunk and Drive in Hyderabad | అత్యధికంగా బైకర్లే..

ఈ ప్రత్యేక తనిఖీల్లో ఏకంగా 445 మంది వాహనదారులు మద్యం మత్తులో తూలుతూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. పట్టుబడిన వారిలో యువతే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాల వారీగా చూస్తే అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

  • ద్విచక్ర వాహనదారులు (Two-wheelers): 377 మంది
  • కార్లు/భారీ వాహనాలు (Four-wheelers/Heavy): 46 మంది
  • ఆటో డ్రైవర్లు (Three-wheelers): 22 మంది

ఆల్కహాల్ మోతాదు (BAC Levels) వివరాలు ఇలా..

పట్టుబడిన వారిలో కొందరు పరిమితికి మించి పీకలదాకా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసులు నమోదు చేసిన బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ (BAC) కేసుల వివరాలు కింది విధంగా ఉన్నాయి:

  • 30 - 50: 100 కేసులు
  • 51 - 100: 191 కేసులు
  • 101 - 150: 84 కేసులు
  • 151 - 200: 39 కేసులు
  • 201 - 250: 12 కేసులు
  • 251 - 300: 09 కేసులు
  • 300 పైన: 10 కేసులు

ఉపేక్షించే ప్రసక్తే లేదు: జాయింట్ సీపీ వార్నింగ్

మద్యం సేవించి వాహనాలు నడిపే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని (Zero Tolerance) హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (Joint CP) ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీలు నగరవ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు. సురక్షిత ప్రయాణం కోసం వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement