Traffic Advisory | కోటి దీపోత్సవం ఎఫెక్ట్.. 16 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు!
Traffic Advisory | హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న కోటి దీపోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రేపటి నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నారు.
- నవంరేపటి నుంచి 30 వరకు ట్రాఫిక్ మళ్లింపులు
- మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు అమలు
- ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచన
Traffic Advisory | హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న కోటి దీపోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రేపటి నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు కట్ట మైసమ్మ దేవాలయం నుంచి ఇందిరాపార్క్ చౌరస్తా, అశోక్‌నగర్ నాలా వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని జాయింట్ సీపీ (ట్రాఫిక్) డీ జోయల్ డేవిస్ తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి స్టీల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. కట్ట మైసమ్మ దేవాలయం వద్ద నుంచి ధోబీఘాట్, డీబీఆర్ మిల్స్, గాంధీనగర్ టీ జంక్షన్, కవాడిగూడ, సీజీఓ టవర్స్, ముషీరాబాద్ చౌరస్తా మీదుగా మళ్లిస్తారు. అశోక్‌నగర్ చౌరస్తా నుంచి కట్ట మైసమ్మ దేవాలయం వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఉండదు. హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్ 9 వైపు మళ్లిస్తారు. కట్ట మైసమ్మ జంక్షన్, ఆర్‌కే మఠ్ యూటర్న్, ఇందిరాపార్క్ చౌరస్తా, బండ మైసమ్మ నుంచి ధర్నాచౌక్ వరకు, ఇందిరాపార్క్ చౌరస్తా నుంచి అశోక్‌నగర్ నాలా వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. వాహనదారులు ఈ మార్గాలను వీలైనంత వరకు నివారించి ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
ఎన్టీఆర్ స్టేడియంలో పార్కింగ్
కోటి దీపోత్సవానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్‌కు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఫేస్‌బుక్ పేజీ (facebook.com/HYDTP), ఎక్స్ ఖాతా (@HYDTP)ను ఫాలో కావాలని పోలీసులు సూచించారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626ను సంప్రదించాలని వాహనదారులకు సీపీ విజ్ఞప్తి చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!





