Saudi Arabia | రియాద్ ఎయిర్‌పోర్టుపై క్షిపణి దాడి.. హైదరాబాద్ వాసి మృతి
Saudi Arabia | సౌదీ అరేబియాలోని రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై శనివారం జరిగిన క్షిపణి దాడుల్లో హైదరాబాద్ వాసి మృతి చెందాడు.
Saudi Arabia | త్రినేత్ర న్యూస్ : సౌదీ అరేబియాలోని రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై శనివారం జరిగిన క్షిపణి దాడుల్లో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. రియాద్‌లో ఐటీ ఇంజినీర్‌గా స్థిరపడ్డ యూసుఫ్ అలీ(45) తన కుటుంబ సభ్యులతో కలిసి మదినా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన సమయంలోనే దాడి జరిగింది. ఈ మిస్సైల్ దాడిలో యూసుఫ్‌తో పాటు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా యూసుఫ్‌కు శస్త్రచికిత్స చేసి రెండు కాళ్లను తొలగించారు. చికిత్స అనంతరం కోలుకుంటాడని భావించారు. కానీ ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావటంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని రియాద్‌లో ఉంటున్న యూసుఫ్ బావమరిది ధ్రువీకరించారు. కామారెడ్డికి చెందిన 36 ఏళ్ల షేక్ సయీద్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. రియాద్‌లోని కింగ్ ఫహద్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
తాజావార్తలు
- ●Rahul Gandhi SC March | ఢిల్లీలో దద్దరిల్లిన 'మార్చ్ ఫర్ డెమోక్రసీ': సుప్రీంకోర్టుకు రాహుల్, ప్రియాంక పాదయాత్ర.. సీఈసీపై పిటిషన్ దాఖలు
- ●Ponnam Prabhakar | ఏసీల్ల కూసోని సవాళ్లు కాదు.. క్షేత్రస్థాయికి రండి
- ●7Seas Entertainment | భారత్‌లో కొత్త రేసింగ్ గేమ్.. ‘ఫార్ములా రైడ్’తో 7సీస్ ఎంటర్టైన్మెంట్
- ●Wockhardt | 3 ఏళ్లలో రూ.1 లక్షను రూ.8 లక్షలుగా మార్చిన ఫార్మా స్టాక్..
- ●Sapta Matrukalu | రాక్షస సంహారంలో జగన్మాతకు అండగా నిలిచిన సప్తమాతృకలు ఎవరు?
- ●KCR | ఆ 35 నియోజకవర్గాల్లో.. కేసీఆర్.. కేసీఆర్.. కేసీఆర్

Rahul Gandhi SC March | ఢిల్లీలో దద్దరిల్లిన 'మార్చ్ ఫర్ డెమోక్రసీ': సుప్రీంకోర్టుకు రాహుల్, ప్రియాంక పాదయాత్ర.. సీఈసీపై పిటిషన్ దాఖలు

Ponnam Prabhakar | ఏసీల్ల కూసోని సవాళ్లు కాదు.. క్షేత్రస్థాయికి రండి

7Seas Entertainment | భారత్‌లో కొత్త రేసింగ్ గేమ్.. ‘ఫార్ములా రైడ్’తో 7సీస్ ఎంటర్టైన్మెంట్

Wockhardt | 3 ఏళ్లలో రూ.1 లక్షను రూ.8 లక్షలుగా మార్చిన ఫార్మా స్టాక్..






