త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HCA | ఇక మా ఓపిక న‌శించింది.. హెచ్‌సీఏ ఉద్యోగుల నిర‌వ‌ధిక స‌మ్మె

HCA | త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారించాల‌ని డిమాండ్ చేస్తూ హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్( HCA ) సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియ‌న్ నిర‌వ‌ధిక స‌మ్మె చేప‌ట్ట‌నున్నారు. పెండింగ్‌లో ఉన్న ఓవ‌ర్ టైమ్ బ‌కాయిలు, గ్రౌండ్ సిబ్బంది క‌న్వేయ‌న్స్ అల‌వెన్సులు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

S

Hyderabad | Published On Mar 5, 2026, 1.15 pm IST

HCA | ఇక మా ఓపిక న‌శించింది.. హెచ్‌సీఏ ఉద్యోగుల నిర‌వ‌ధిక స‌మ్మె
Advertisement

HCA | త్రినేత్ర‌.న్యూస్ : త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారించాల‌ని డిమాండ్ చేస్తూ హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్( HCA ) సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియ‌న్ నిర‌వ‌ధిక స‌మ్మె చేప‌ట్ట‌నున్నారు. పెండింగ్‌లో ఉన్న ఓవ‌ర్ టైమ్ బ‌కాయిలు, గ్రౌండ్ సిబ్బంది క‌న్వేయ‌న్స్ అల‌వెన్సులు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

హెచ్ఆర్ క‌న్స‌ల్టెన్సీ నియామ‌క ప్ర‌తిపాద‌న‌ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గ‌తంలో మూడు నెలల పాటు జీతాలు లేకపోయినా అంకితభావంతో పనిచేశామని సిబ్బంది గుర్తు చేశారు. ​మెడికల్ రీయింబర్స్‌మెంట్లతో పాటు ఉద్యోగులందరికీ క్యాష్‌లెస్ ఆరోగ్య బీమా కల్పించాలని వినతి చేశారు. ​సమస్యల పరిష్కారానికి గతంలో మేనేజ్‌మెంట్‌కు ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని ఆవేదన వ్య‌క్తం చేశారు. ​సమ్మె కారణంగా మ్యాచ్‌ల నిర్వహణకు అంతరాయం కలిగితే దానికి మేనేజ్‌మెంటే బాధ్యత వహించాలని స్ప‌ష్టం చేశారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నాం.. ఇక మా ఓపిక నశించింది అని హెచ్‌సీఏ సిబ్బంది ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ ​డిమాండ్లు నెరవేరే వరకు ఉప్పల్ స్టేడియంలో పనులు నిలిపివేస్తామని యూనియన్ హెచ్చరించింది.

Advertisement
Advertisement