త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | య‌ముడు మిమ్మ‌ల్ని వ‌దిలేసినా.. చ‌ట్టం నుంచి మాత్రం త‌ప్పించుకోలేరు.. మందుబాబుల‌కు హెచ్చ‌రిక‌

CP Sajjanar | కొత్త సంవ‌త్స‌రానికి ఇంకా ఒకే ఒక్క రోజు మిగిలి ఉంది. రేపు డిసెంబ‌ర్ 31 కావ‌డంతో.. యువ‌త న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌కు సిద్ధ‌మవుతున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌నర్ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

S

Hyderabad | Published On Dec 30, 2025, 2.32 pm IST

CP Sajjanar | య‌ముడు మిమ్మ‌ల్ని వ‌దిలేసినా.. చ‌ట్టం నుంచి మాత్రం త‌ప్పించుకోలేరు.. మందుబాబుల‌కు హెచ్చ‌రిక‌
Advertisement

CP Sajjanar | త్రినేత్ర‌.న్యూస్ : కొత్త సంవ‌త్స‌రానికి ఇంకా ఒకే ఒక్క రోజు మిగిలి ఉంది. రేపు డిసెంబ‌ర్ 31 కావ‌డంతో.. యువ‌త న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌కు సిద్ధ‌మవుతున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌నర్ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త నాలుగైదు రోజుల నుంచి ఆయ‌న యువ‌త‌ను అప్ర‌మ‌త్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా మ‌రో హెచ్చ‌రిక చేశారు.

చౌరస్తాలో 'డ్రంక్ అండ్ డ్రైవ్' తనిఖీలు ఉన్నాయని.. సందుల్లో దూరి, ప్రమాదకర విన్యాసాలతో వాహనాలు నడపడం విజ్ఞత అనిపించుకోదు అని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు. ఆ అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదంలో పోయేది మీ ప్రాణమో, ఎదుటివారి ప్రాణమో ఎవరికెరుక? ఎవరు మరణించినా.. కన్నవారికి మిగిలేది కడుపుకోతే. మీ క్షేమం కోరే తల్లిదండ్రులకు జీవితాంతం తీరని శోకాన్ని మిగల్చకండి అని విజ్ఞ‌ప్తి చేశారు.

మద్యం మత్తులో వాహనం నడపడమంటే.. మృత్యువును ఆహ్వానించడమే. ఒకవేళ యముడు మిమ్మల్ని వదిలేసినా, చట్టం నుంచి మాత్రం తప్పించుకోలేరు. మీ ప్రాణ విలువ మాకు తెలుసు.. అందుకే ఈ హెచ్చరిక అని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు. చివ‌ర‌కు మీ పోలీస్ అని సీపీ అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement