CP Sajjanar | నన్ను తీవ్రంగా కలచివేస్తున్న వాస్తవం ఆ ఒక్కటే.. సీపీ సజ్జనార్ కీలక ట్వీట్
CP Sajjanar | హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ట్వీట్ చేశారు. తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న పిల్లలను ఆలోచింపజేసేలా ఆయన ఎక్స్ వేదికగా ఓ సందేశం ఇచ్చారు. వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులను అనాథలుగా వదిలేసే వారిని ఉపేక్షించబోమని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
CP Sajjanar | హైదరాబాద్ : హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ట్వీట్ చేశారు. తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న పిల్లలను ఆలోచింపజేసేలా ఆయన ఎక్స్ వేదికగా ఓ సందేశం ఇచ్చారు. వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులను అనాథలుగా వదిలేసే వారిని ఉపేక్షించబోమని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
సీపీ సజ్జనార్ సందేశం ఇదే..
'నిత్యం ఎంతోమంది బాధితులు తమ కష్టనష్టాలను చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. గతంలో టీజీఎస్‌ఆర్‌టీసీ, సైబరాబాద్ సహా వివిధ జిల్లాల్లో పనిచేసిన అనుభవంలోనూ.. ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గానూ నన్ను తీవ్రంగా కలచివేస్తున్న వాస్తవం ఒక్కటే. వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాథలుగా వదిలేయడం అనేకసార్లు చూశా. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.
తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మం. ఇది చర్చలకు తావులేని వారి హక్కు. ఈ విషయంలో ఎలాంటి సాకులకు, సమర్థనలకు ఆస్కారం లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి.. ఈ రోజు మీ తల్లిదండ్రుల పట్ల మీరు ప్రవర్తించే తీరే.. రేపు మీ పిల్లలకు పాఠం అవుతుంది. నేడు మీరు ఏది విత్తుతారో.. వృద్ధాప్యంలో అదే కోసుకుంటారు.
వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదు. కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. దిక్కుతోచని స్థితిలో, తమ గోడు ఎవరూ వినడంలేదని కుమిలిపోతున్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లికి పోలీసుశాఖ అండగా ఉంటుంది. మీరు ఒంటరి వారు కాదు. మీ ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. బాధితులు నిర్భయంగా నేరుగా సంప్రదించవచ్చు' అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు.
నిత్యం ఎంతోమంది బాధితులు తమ కష్టనష్టాలను చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. గతంలో టీజీఎస్‌ఆర్‌టీసీ, సైబరాబాద్ సహా వివిధ జిల్లాల్లో పనిచేసిన అనుభవంలోనూ.. ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గానూ నన్ను తీవ్రంగా కలచివేస్తున్న వాస్తవం ఒక్కటే.
వృద్ధాప్యంలో, అనారోగ్యంతో… pic.twitter.com/sBDOllJA1G
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 16, 2025
సంబంధిత వార్తలు

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
సెప్టెంబర్ 23, 2026

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
సెప్టెంబర్ 23, 2026

Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?



