త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | నేర‌ ర‌హిత న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యం : సీపీ స‌జ్జ‌నార్‌

CP Sajjanar | హైదరాబాద్‌ను నేరరహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యమ‌ని సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ తెలిపారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనర్ కార్యాలయంలో అన్నిరకాల సర్వీస్ ప్రొవైడర్ల నోడల్ అధికారులతో కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు.

P

Hyderabad | Published On Jan 28, 2026, 11.15 pm IST

CP Sajjanar | నేర‌ ర‌హిత న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యం : సీపీ స‌జ్జ‌నార్‌
Advertisement

CP Sajjanar | హైదరాబాద్‌ను నేరరహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యమ‌ని సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ తెలిపారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనర్ కార్యాలయంలో అన్నిరకాల సర్వీస్ ప్రొవైడర్ల నోడల్ అధికారులతో కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. టెలికాం, ఇంటర్నెట్, ఫుడ్ డెలివరీ, కొరియర్, రవాణా, అన్ని రకాల సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులు స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేసుల ద‌ర్యాప్తులో పోలీసుల‌కు పూర్తి స‌హ‌కారం అందించాల‌న్నారు. స‌మాచారం అడిన వెంట‌నే స్పందించేందుకు ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల‌న్నారు. కేవలం లాభార్జనే ధ్యేయంగా కాకుండా సర్వీస్ ప్రొవైడర్లు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. ఈ-కామర్స్, కొరియర్ సేవల మాటున గంజాయి, మత్తు పదార్థాలు, నిషిద్ధ వస్తువుల రవాణా జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆయా సంస్థలు పటిష్టమైన నిఘా వేయాల‌ని సూచించారు.

అనుమానిత పార్సిల్స్‌ను గుర్తించిన వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాల‌ని, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలకు సహకరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ ప్రొవైడర్లలో కొంత మంది క్యాబ్, బైక్ డ్రైవర్లు మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లు తమ డ్రైవర్లపై నిరంతరం ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు. ప్రయాణికులు బుక్ చేసుకున్న స‌మ‌యంలో.. వెళ్లాల్సిన ప్రదేశం.. చెప్పిన తర్వాత.. డబ్బు చెల్లించిన తర్వాత డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారని, దాంతో జ‌నం ఇబ్బందులుప‌డుతున్నార‌న్నారు. ఇలాంటి డ్రైవ‌ర్ల‌పై సంస్థ‌లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. స‌మావేశంలో అడిష‌న‌ల్ సీపీలు ఎం శ్రీ‌నివాస్‌, త‌ఫ్సీర్ ఇక్బాల్, శ్వేత, డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీలు, ఇత‌ర అధికారులు హాజ‌ర‌య్యారు.

Advertisement

తాజావార్తలు

Advertisement